తెలుగు తెరకి పరిచయమవుతోన్న మహేశ్ మేనకోడలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు తెరకి పరిచయమవుతోన్న మహేశ్ మేనకోడలు!

  • దర్శకురాలిగా మహేశ్ సోదరి మంజుల 
  • ముఖ్యమైన పాత్రలో ఆమె కూతురు జాన్వీ 
  • ఆమె నటన చూశాక నమ్మకం పెరిగింది 
  • జాన్వీ నటన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి మహేశ్ ను గుర్తుచేసింది
సూపర్ స్టార్ కృష్ణ కూతురు .. మహేశ్ బాబు సోదరి మంజుల గురించి చాలామందికి తెలుసు. మొదట్లో హీరోయిన్ కావాలనుకున్న ఆమె, కొన్ని కారణాల వలన ఆ దారిలో ప్రయాణం చేయలేకపోయారు. ఆ తరువాత ఆమె అభిరుచి కలిగిన దర్శక నిర్మాతగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మంచి కథానాయికగా పేరు తెచ్చుకునే అవకాశం అప్పట్లో తనకి లేకపోవడంతో, తన కూతురు జాన్వీ ద్వారా ఆ కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఆమె వున్నారు.

అందువల్లనే ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా తాను తెరకెక్కిస్తోన్న సినిమా ద్వారా జాన్వీని పరిచయం చేస్తున్నారు. ఈ విషయమై మంజుల మాట్లాడుతూ " మొదటి నుంచి కూడా జాన్వీని షూటింగ్స్ కి తీసుకురాలేదు. అందువలన ఈ సినిమా షూటింగ్ కి వచ్చిన రోజున నెర్వస్ గా ఫీలైంది. ఈ సినిమాలో జాన్వీ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. మొదటి సీన్ ను జాన్వీ పై షూట్ చేసిన తరువాత, ఆమెపై నాకు మరింత నమ్మకం పెరిగింది .. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మహేశ్ గుర్తొచ్చాడు" అంటూ చెప్పుకొచ్చారు. దాంతో .. మహేశ్ మేనకోడలు భవిష్యత్తులో హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయని చెప్పుకుంటున్నారు.        
sundeep kishan

More Telugu News