'సైరా' సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం 'రేసుగుర్రం' విలన్!
- 'సైరా' షూటింగ్ కి జరుగుతోన్న ఏర్పాట్లు
- డిసెంబర్ 6న షూటింగ్ మొదలు
- రవికిషన్ కి ఛాన్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి
తాజాగా మరో ముఖ్యమైన పాత్ర కోసం భోజ్ పురి నటుడు .. 'రేసుగుర్రం' విలన్ .. రవికిషన్ ను ఎంపిక చేసుకున్నారు. 'రేసుగుర్రం'లో రవికిషన్ చేసిన విలన్ పాత్ర .. ఆయనకి మంచి గురింపును తెచ్చిపెట్టింది. అప్పటి నుంచే దర్శకుడు సురేందర్ రెడ్డితో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సినిమాలోని ఒక పాత్రకి రవికిషన్ కరెక్ట్ గా సరిపోతాడని భావించిన సురేందర్ రెడ్డి .. ఆయనను తీసుకున్నాడట.