'ఉంటే ఉంటావు, పోతే పోతావు...' అంటూ ధోనీకి విలువైన సలహా ఇచ్చిన సెహ్వాగ్!
- న్యూజిలాండ్ తో రెండో టీ-20లో నింపాదిగా ఆడిన ధోనీ
- విమర్శలు గుప్పించిన నెటిజన్లు, మాజీలు
- తొలి బంతి నుంచే విరుచుకుపడు
- ధోనీకి సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్
ఈ ప్రయత్నంలో అవుట్ అయి పోయినా ఫర్వాలేదని చెప్పాడు. క్రీజులో పాతుకుపోయి పరుగులు చేయకుండా ఉండటంతో పాటు, ఆడిన నాలుగు బంతులనూ బౌండరీలకు పంపితే, టీ-20ల్లో మేలు కలుగుతుందని చెప్పాడు. సాధించాల్సిన పరుగులు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, ధోనీ వంటి ఆటగాడు, వేగాన్ని పెంచలేకపోతే, ఆ ప్రభావం తరువాత వచ్చే వారిపై పడుతుందని అన్నాడు. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తరువాత ధోనీని అనిల్ కుంబ్లే వంటి ఆటగాళ్లు విమర్శించగా, గవాస్కర్ వంటి వారు వెనకేసుకు వచ్చిన సంగతి తెలిసిందే.