సూపర్ ఫిట్‌నెస్.. క్రీజులో ఏకంగా 16.55 గంటల పాటు గడిపేసిన హిమాచల్‌ప్రదేశ్ కెప్టెన్!
- రెండో రోజు క్రీజులోకి వచ్చి చివరి రోజు వరకు క్రీజులోనే
- మొత్తం 16.55 గంటలు బ్యాటింగ్ చేసిన నాయర్
- ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత సుదీర్ఘ బ్యాటింగ్
రంజీట్రోఫీలో భాగంగా జమ్ము కశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాజీవ్ ఈ ఘనత సాధించాడు. నవంబరు 3, 1999న ఈ మ్యాచ్ ముగియగా ఇన్నింగ్స్‌లో రెండో రోజు క్రీజులోకి వచ్చిన నాయర్ చివరి రోజు వరకు క్రీజులోనే ఉన్నాడు. మొత్తం 728 బంతులు ఎదుర్కొన్న నాయర్ 271 పరుగులు చేశాడు. క్రికెట్ గణాంకాల విశ్లేషకుడు అభిషేక్ ముఖర్జీ ఈ వివరాలను మీడియాకు తెలిపారు.