తెలంగాణను సాధించుకుంది బతుకమ్మ చీరల కోసమా?: రేవంత్ రెడ్డి
- బర్రెలు, గొర్రెలు, బతుకమ్మ చీరలు అంటూ మాయమాటలు చెబుతున్నారు
- తెలంగాణను తన కుటుంబ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు
- వీటి కోసమేనా తెలంగాణ బిడ్డలు ప్రాణాలు బలి ఇచ్చింది?
కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాక ముందు కేసీఆర్ చెప్పిందేంటీ? ఇప్పుడు చేస్తోందేంటీ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బర్రెలు, గొర్రెలు, బతుకమ్మ చీరలు అంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. బతుకమ్మ చీరల కోసమా తెలంగాణను సాధించుకుంది? అని ఆయన విమర్శించారు. వీటి కోసమేనా తెలంగాణ బిడ్డలు ప్రాణాలు బలి తీసుకుంది? అని నిలదీశారు. ఈ బర్రెలు, గొర్రెలని ఆంధ్ర పాలకులు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు.