నేటి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది: బీసీసీఐ
- స్పష్టత నిచ్చిన అధికారులు
- మ్యాచ్ ఉండబోదని ఎలా చెబుతారు?
- తప్పు చేసిన వారిపై చర్యలుంటాయన్న అమితాబ్ చౌదరి
ఐసీసీ, బీసీసీఐ నిబంధనలను పుణె స్టేడియం సిబ్బంది ఉల్లంఘించినట్టు తాము గుర్తించామని, దీనిపై చర్యలుంటాయని, అంతమాత్రాన మ్యాచ్ రద్దు అవుతుందని ఎలా చెబుతారని బీసీసీఐ ప్రతినిధి అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు. పిచ్ పై వచ్చిన వార్తలు చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని ఆయన అన్నారు. మ్యాచ్ రద్దు చేస్తారన్న వార్తలు పూర్తి నిరాధారమైన పుకారేనని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా వెల్లడించింది.