allari naresh: హిట్ కోసం అల్లరి నరేశ్ ప్రయత్నాలు .. 'సుడిగాడు' దర్శకుడితో మరో సినిమా!

షార్ట్స్‌లో చూడండి
అల్లరి నరేశ్ సినిమాలు ఆద్యంతం హాస్యంతో కొనసాగుతూ ఉంటాయి. అందువలన ఆయన సినిమాలను అన్నివర్గాల ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. అయితే కొంతకాలంగా ఆయన సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో తదుపరి సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడు.

 ఈ క్రమంలో ఇటీవలే దర్శకుడు సత్తిబాబుతో ఒక సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'బెట్టింగ్ బంగార్రాజు' .. 'యముడికి మొగుడు' వచ్చాయి. ఇక దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుతోను ఒక సినిమాను చేయడానికి ఓకే చెప్పాడనేది తాజా సమాచారం. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన 'సుడిగాడు' ఏ స్థాయి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. త్వరలోనే వీళ్లు సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.             
Go Back to Shorts
allari naresh

More Telugu News