tarun bhaskar: 'పెళ్లి చూపులు' డైరెక్టర్ తాజా చిత్రం.. ఈ రోజు నుంచే షూటింగ్!

షార్ట్స్‌లో చూడండి
ఆమధ్య చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో 'పెళ్లి చూపులు' ఒకటిగా కనిపిస్తుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తాను ఎంచుకున్న కథను కొత్తగా చెప్పిన తీరు కాసుల వర్షం కురిపించింది. తన తరువాత వచ్చే దర్శకులకు ఆయన ఒక కొత్త రూట్ చూపించినట్టైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

 అలాంటి తరుణ్ భాస్కర్ మరో కథను సిద్ధం చేసుకుని, ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నారు. అంతా కొత్త వాళ్లతో ఆయన ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'పెళ్లి చూపులు' సినిమాను జనంలోకి తీసుకెళ్లి .. ఆ సినిమా సక్సెస్ లో సురేశ్ బాబు కీలకమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ మరో సంచలనానికి తెరతీస్తాడేమో చూడాలి.    
Go Back to Shorts
tarun bhaskar

More Telugu News