కాంగ్రెస్ పార్టీ నేతలపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన సినీ నటి ఖుష్బూ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ పార్టీ నేతలపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన సినీ నటి ఖుష్బూ

  • ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన ఖుష్బూ
  • తమిళనాడు కాంగ్రెస్ నేతలపై రాహుల్ కు ఫిర్యాదు
  • తమిళనాడు రాజకీయ పరిస్థితులపై చర్చ
తమిళనాడు కాంగ్రెస్‌ నేతలపై సినీ నటి, ఆ పార్టీ నేత ఖుష్బూ ఏఐసీసీ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం మాట్లాడిన ఖుష్బూ, తాను కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిని కాదంటూ విమర్శలు చేసిన వారిపై ఫిర్యాదు చేశానని తెలిపారు.

ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఖుష్బూకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేదని దక్షిణ చెన్నై జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరాటే త్యాగరాజన్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన తాను రాహుల్‌ గాంధీని కలిసి కరాటే త్యాగరాజన్‌ తో పాటు పలువురు నేతల వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశానని చెప్పారు. అనంతరం తమిళనాడులో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. 
Tamilnadu
congress
khushboo
rahul gandhi

More Telugu News