నెల్లూరు చిన్నోడు ఇరగదీశాడు.. రెండు వారాల వ్యవధిలో రెండు ట్రిపుల్ సెంచరీలు బాదేశాడు!
- ఆంధ్ర క్రికెట్ సంఘం చరిత్రలో రికార్డు
- ఒకే టోర్నీలో రెండుసార్లు ఈ ఘనత సాధించిన రేవంత్
- భవిష్యత్ ఆశాకిరణంగా ప్రశంసలు
గత నెల 23న విజయనగరం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రేవంత్ రెడ్డి చెలరేగి ఆడి ట్రిపుల్ సెంచరీ (304 నాటౌట్) నమోదు చేశాడు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రేవంత్ మరోమారు రెచ్చిపోయాడు. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన రేవంత్ 289 బంతులు ఎదుర్కొని 53 ఫోర్లతో 301 పరుగులు చేసి రెండో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ఏసీఏ చరిత్రలోనే ఇది రికార్డు. ఒకే టోర్నీలో రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ చేయడం ఏ వయో విభాగంలోనైనా ఇదే తొలిసారి. రేవంత్ ఆటకు అందరూ ఫిదా అయిపోయారు. అతడు షాట్లు కొట్టే తీరుకు ముగ్ధులయ్యారు. భవిష్యత్ టీమిండియా క్రికెటర్‌గా అప్పుడే ఆకాశానికెత్తేస్తున్నారు.