chaitu: 'సవ్యసాచి'తో తెలుగు తెరకి కొత్త హీరోయిన్!

షార్ట్స్‌లో చూడండి
నాగ చైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి 'సవ్యసాచి' సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్రకి కూడా ఎంతో ప్రాముఖ్యత వుంటుందట. ఈ పాత్ర కోసం కొంతమంది కథానాయికలను పరిశీలించిన టీమ్, చివరిగా నిధీ అగర్వాల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.

 టైగర్ ష్రాఫ్ జోడీగా 'మున్నా మైఖేల్' అనే బాలీవుడ్ మూవీతో నిధి అగర్వాల్ వెండితెరకి పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అమ్మడి గ్లామర్ కి హండ్రెడ్ మార్కులు పడిపోయాయి. దాంతో ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 'సవ్యసాచి' సినిమాను అంగీకరించింది. మాధవన్ కీలకమైన పాత్రను పోషించే ఈ సినిమా, ఈ నెల 3వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.  
Go Back to Shorts
chaitu
nidhi agarwan

More Telugu News