'బిగ్ బాస్' హౌస్ లో అల్లరి చేయనున్న నరేశ్!

'బిగ్ బాస్' హౌస్ లో అల్లరి చేయనున్న నరేశ్!

అల్లరి నరేశ్ కామెడీని ఇష్టపడే అభిమానులు చాలామందే వున్నారు. ఆయన సినిమాలకి మంచి ఆదరణ ఉండటం వల్లనే చకచకా 50 సినిమాలు పూర్తి చేయగలిగాడు. అయితే ఈ మధ్య కాలంలో కథల ఎంపిక విషయంలో ఆయన కొత్తదనానికి ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం వలన సక్సెస్ పలకరించి చాలాకాలమైంది. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన 'మేడ మీద అబ్బాయి' చేశాడు.

 టైటిల్ జనంలోకి బాగానే పోయింది. ఇక సినిమా రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఆయన 'బిగ్ బాస్' హౌస్ కి వెళ్లి అక్కడి కంటెస్టెంట్ లతో సందడి చేయనున్నాడు. ఈ ఎపిసోడ్ ఈ రోజు రాత్రికి ప్రసారం కానుంది. ఇంతకుముందు తమ సినిమా ప్రమోషన్స్ కోసం రానా .. తాప్సి .. విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. ఆ సినిమాలన్నీ కూడా హిట్ కొట్టాయి. అలాగే అల్లరి నరేశ్ కి కూడా సక్సెస్ దొరుకుతుందేమో చూడాలి. 
allari naresh. nikhila vimal

More Telugu News