సందీప్ మళ్లీ సూపర్ ఛాన్స్ కొట్టేశాడండోయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సందీప్ మళ్లీ సూపర్ ఛాన్స్ కొట్టేశాడండోయ్!

దర్శకుడిగా గౌతమ్ మీనన్ ప్రతిభా పాటవాలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అయన ఎంత గొప్ప దర్శకుడో .. అంతటి అభిరుచి కలిగిన నిర్మాత. ఒక వైపున తన సినిమాలను తెరకెక్కిస్తూనే, మరో వైపున నిర్మాతగానూ తన బాధ్యతలను నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఆయన 'డి 16' దర్శకుడు కార్తీక్ నరేన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ నటిస్తున్నాడు.

 గౌతమ్ మీనన్ .. కార్తీక్ నరేన్ కాంబినేషన్ కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ హీరోగా తన దర్శకత్వంలో మరో సినిమాను తెరకెక్కించడానికి గౌతమ్ మీనన్ రెడీ అవుతున్నారట. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమాతో సందీప్ కిషన్ కెరియర్ మరింత ఊపందుకునే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
sundeep kishan

More Telugu News