'గౌతమ్ నంద'లో గోపీచంద్ నెగెటివ్ రోల్ పై టాక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గౌతమ్ నంద'లో గోపీచంద్ నెగెటివ్ రోల్ పై టాక్!

ఇటీవల కాలంలో కొంతమంది హీరోలు .. తెరపై తాము విలన్ గా కనిపిస్తే ఎలా ఉంటుందో చూసుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళంలో సూర్య .. విజయ్ లు ఒకే సినిమాలో హీరోగాను .. విలన్ గాను చేశారు. ఇక 'జై లవకుశ'లో ఎన్టీఆర్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గోపీచంద్ కూడా 'గౌతమ్ నంద'లో హీరోగానే కాదు నెగెటివ్ రోల్ లోను కనిపించాడు.

 సాధారణంగా తెరపై ఎప్పుడూ హీరోలుగా అదరగొడుతోన్న వాళ్లు .. హఠాత్తుగా నెగెటివ్ రోల్ ను చేస్తే కొత్తగా అనిపిస్తుంది కనుక ఆసక్తికరంగా చూస్తారు. కానీ గోపీచంద్ విషయంలో అలా జరగడం లేదట. ఆల్రెడీ గోపీచంద్ 'జయం' .. 'వర్షం' వంటి సినిమాల్లో విలన్ గా అదరగొట్టేశాడు. ఆయనలో ఆ స్థాయి విలనిజాన్ని ముందే చూసి ఉండటం వలన .. 'గౌతమ్ నంద'లోని నెగెటివ్ రోల్ ఆడియన్స్ కి ఆనడం లేదని చెప్పుకుంటున్నారు.
gopichand
hansika

More Telugu News