పవన్ కల్యాణ్ 'ఎంపవర్ స్టార్'.. డిప్యూటీ సీఎం విజన్‌పై ఉపాసన కొణిదెల ప్రశంసలు

Both States
Advertisement
  • పిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసన కొణిదెల, స్మృతి ఇరానీ
  • మహిళలు, విద్యార్థినుల సాధికారతకు పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారన్న ఉపాసన
  • అపోలో ఫౌండేషన్ 109 మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ వ్యాపారవేత్త, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల  పర్యటించారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ఆమె పిఠాపురం పరిధిలోని అగ్రహారంలో నూతనంగా నిర్మించిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అపోలో ఫౌండేషన్ చేపట్టిన 'అపోలో ఆరంభ్' ప్రాజెక్టులో భాగంగా కొణిదెల కుటుంబ సహకారంతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజన్‌ను ఉపాసన కొణిదెల ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల్లో పవన్ కల్యాణ్ ‘పవర్ స్టార్’గా సుపరిచితులైనప్పటికీ, పిఠాపురంలో ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు, సాధికారత కార్యక్రమాలను చూసిన తర్వాత తనకు ఆయన ‘ఎంపవర్ స్టార్’గా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు నైపుణ్యాభివృద్ధి, రుణాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుతో విద్యార్థుల సాధికారతకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అపోలో ఫౌండేషన్ 109 మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి కేంద్రాన్ని పిఠాపురంలో ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రం స్థానిక తల్లులు, చిన్నారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని నిర్వాహకులు వెల్లడించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Upasana KonidelaPawan KalyanSmriti IraniPithapuramApollo FoundationModel Anganwadi Center

More Telugu News

రూ.21,952 కోట్ల కలెక్షన్లతో ఊచకోత.. గేమింగ్ హిస్టరీని తిరగరాసిన రాక్‌స్టార్ గేమ్!

20 Nov, 17:10

తాడిపత్రిలో ఉద్రిక్తత: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు, వాహనాలకు నిప్పు

20 Nov, 16:48

రూ.9 కోట్ల మందు రూ.2.5 లక్షలే.. పసిపిల్లల ప్రాణాల కోసం పోరాడిన హైదరాబాద్ డాక్టర్!

20 Nov, 16:39

కడప జడ్పీ పీఠం వివాదం.. రేపు కీలక నిర్ణయం ప్రకటిస్తానన్న ఆదినారాయణరెడ్డి

20 Nov, 16:23

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. 25,800 దాటిన నిఫ్టీ

20 Nov, 16:14

నేను ‘సెహ్వాగ్ 2.0’ కావడానికి రాలేదు.. తండ్రితో పోలికపై ఆర్యవీర్‌ బోల్డ్‌ కామెంట్స్‌

20 Nov, 16:14

ఖనిజ సంపదపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ఏపీలో రేర్ ఎర్త్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం

20 Nov, 16:05

నా ఎత్తు, కేటీఆర్ గడ్డం గురించేనా నీ పంచాయితీ?.. సీఎం రేవంత్‌ ప్రసంగంపై భగ్గుమన్న హరీశ్

20 Nov, 15:52

డ్రెస్ కోడ్ పేరుతో అయ్యప్ప స్వామికి నో ఎంట్రీ.. హైదరాబాద్‌ టీసీఎస్ వద్ద భగ్గుమన్న నిరసన!

20 Nov, 15:40

కేసీఆర్ నా కథలో రావణాసురుడు.. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటా లీడర్: సీఎం రేవంత్

20 Nov, 15:33

రేవంత్ రెడ్డి పాలనలో క్రైస్తవులు, దళితులపై దాడులు పెరిగాయి: కేఏ పాల్

20 Nov, 15:31

శత్రువులను గడగడలాడించే అమెరికా ఫైటర్ జెట్‌కు.. 256 ఎంబీ మెమరీ కార్డు కావాలట!

20 Nov, 15:22

స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

20 Nov, 15:16

ఐఎస్ఐ అతిథిగా దావూద్ రాచభోగాలు.. పాక్‌లో డాన్ రహస్య జీవితాన్ని బయటపెట్టిన మాజీ ఎఫ్‌బీఐ అధికారి!

20 Nov, 15:05
..More Telugu News