Advertisement

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై విచారణ జరపాలి: కవిత డిమాండ్

Telangana
Advertisement
  • ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? లేదా? అనే అంశంపై బీఆర్ఎస్ స్పష్టతనివ్వాలన్న కవిత
  • గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతితో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య
  • సిద్ధిపేటలో బీఆర్ఎస్ కార్యాలయానికి భూమిపూజ చేసిన కవిత దంపతులు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈరోజు సిద్దిపేట జిల్లా పర్యటనకు వచ్చిన కవిత, తన భర్తతో కలిసి పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు ప్రత్యేకంగా కెనాల్ ఉందా లేదా అనే విషయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేయాలని కవిత ప్రశ్నించారు. మౌనంగా ఉన్నంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావని ఆమె పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఆమె తేల్చిచెప్పారు. ప్రజల తరఫున తప్పులను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తుంటే, తనపై ఎదురుదాడి చేయడం సరైంది కాదన్నారు.

తన వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి వస్తున్న విమర్శలపై స్పందిస్తూ కవిత తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు. "నేను.. నా అఫిడవిట్‌లో చూపినదానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా.. ప్రజలకు రాసిస్తా" అని ఆమె స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

KavithaKCR FarmhouseWater Diversion InquiryTelangana Rakshana SenaBRS PartySiddipet

More Telugu News

ఎం.ఎం.కీరవాణిలో ఇంత మార్పా? ఫొటోలు పంచుకున్న అనుపమ్‌ ఖేర్

13 Nov, 15:01

నాలుగో వన్డేలో భారత్‌కు ఘోర పరాజయం.. 244 పరుగులతో న్యూజిలాండ్‌ చారిత్రక విజయం!

13 Nov, 14:55

ఏపీలో కనిపిస్తున్న మార్పులు, అభివృద్ధి అసాధారణం.. చంద్రబాబు నాయకత్వంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

13 Nov, 14:50

'ఇట్లు అర్జున' (మూవీ రివ్యూ)

13 Nov, 14:46

క్యాబ్‌ త్వరగా బుక్‌ కావాలంటే ముందే ‘టిప్‌’.. ఓలాపై సీసీపీఏ జరిమానా!

13 Nov, 14:42

ఏపీ రాజధానిలో ఒబెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్.. సీఐఐ సదస్సులో కీలక ఒప్పందం

13 Nov, 14:37

టీటీడీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

13 Nov, 14:28

హైదరాబాద్‌ భారత్‌ సమ్మిట్‌కు 115 మంది విదేశీ వక్తలకు నో ఎంట్రీ.. శశిథరూర్‌ సంచలన ఆరోపణలు

13 Nov, 14:20

బిల్ గేట్స్‌ను అలా ఒప్పించా.. సీఐఐ సదస్సులో ఆసక్తికర విషయాలు చెప్పిన చంద్రబాబు

13 Nov, 14:08

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం: హరీశ్ రావు హెచ్చరిక

13 Nov, 14:07

అమెరికాలో రికార్డు స్థాయిలో బహిష్కరణలు.. ఏడాదిలోనే 4.8 లక్షల మందిని పంపేసిన వైనం

13 Nov, 13:46

అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం: మంత్రి పొన్నం ప్రభాకర్

13 Nov, 13:44

క్యాబ్ రెంటల్స్‌కు కొత్త రూల్స్.. వ్యాపారం ఇక మరింత సులభం!

13 Nov, 13:32

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం.. భారత విమానయాన రంగంలో గందరగోళం

13 Nov, 13:25
..More Telugu News