Advertisement

ఏపీలో కనిపిస్తున్న మార్పులు, అభివృద్ధి అసాధారణం.. చంద్రబాబు నాయకత్వంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

Andhra
Advertisement
  • విశాఖలో ఘనంగా జరిగిన ‘టైమ్ ఇంపాక్ట్ డిన్నర్’
  • సీఎం చంద్రబాబుతో ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ ముఖాముఖి
  • ఏపీ అభివృద్ధి నమూనాను ప్రపంచానికి చాటుతామన్న డగ్లస్
  • ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు ప్రాధాన్యత ఇస్తున్నామన్న సీఎం
  • ఆరు నెలల రికార్డు సమయంలోనే గూగుల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానం, పారిశ్రామిక పురోగతిని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పేలా విశాఖపట్నంలో ‘టైమ్ ఇంపాక్ట్ డిన్నర్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా స్థానిక ది పార్క్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ‘టైమ్’ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డామియన్ డగ్లస్‌తో ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. సుమారు 100 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార రంగ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు కల్పిస్తున్న అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటులో వేగం తదితర అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కే పరిమితం కాకుండా, మరింత వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు వేగంగా గ్రౌండింగ్ కావడానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దీనికి ఉదాహరణగా గూగుల్ ప్రాజెక్టును ఆయన ప్రస్తావించారు. 

ఏపీలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుపై 2025 అక్టోబర్‌లో ప్రకటన రాగా, ప్రభుత్వం చూపిన చొరవతో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 2026 ఏప్రిల్‌లో శంకుస్థాపన పూర్తయిందని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ప్రవాహాన్ని అంతర్జాతీయ వేదికలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ‘టైమ్’ ప్రతినిధులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది మరోసారి ఏపీకి వచ్చి రాష్ట్ర పురోగతిని స్వయంగా పరిశీలించాలని ఆహ్వానించారు.

‘టైమ్’ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డామియన్ డగ్లస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వ పటిమ, రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి తీరుపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో కనిపిస్తున్న మార్పులు, అభివృద్ధి అసాధారణమైనవని పేర్కొన్నారు. రాష్ట్రం సాధిస్తున్న విజయాలు సీఎం అద్భుతమైన దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానాన్ని, ఇక్కడి విజయవంతమైన అభివృద్ధి నమూనాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ప్రపంచానికి పరిచయం చేస్తామని డగ్లస్ భరోసా ఇచ్చారు.

అనంతరం ‘బిల్డ్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ గ్రోత్’ అనే అంశంపై ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చ జరిగింది. వరాహ క్లైమేట్‌ఏజీ ప్రతినిధి మధుర్ జైన్, పబ్లిసిస్ గ్రూప్ సీఈఓ అనుప్రియ ఆచార్య, ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ ఎండీ రాజేష్ మిట్టల్, ఆసియా అభివృద్ధి బ్యాంకు సౌత్ ఆసియా విభాగం ఇండియా రెసిడెంట్ మిషన్ కంట్రీ డైరెక్టర్ మియో ఓకా ఇందులో పాల్గొన్నారు. టైమ్100 నెక్ట్స్ ఇండియా సీనియర్ ప్రొడ్యూసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ గాయత్రి రంగాచారి షా మోడరేటర్‌గా వ్యవహరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడే భాగస్వామ్యాలు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలు, సుస్థిర పారిశ్రామిక వృద్ధిపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Chandrababu NaiduTIME MagazineDamian DouglasAndhra Pradesh DevelopmentVisakhapatnam TIME Impact DinnerSpeed of Doing Business

More Telugu News

ఎం.ఎం.కీరవాణిలో ఇంత మార్పా? ఫొటోలు పంచుకున్న అనుపమ్‌ ఖేర్

13 Nov, 15:01

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై విచారణ జరపాలి: కవిత డిమాండ్

13 Nov, 14:58

నాలుగో వన్డేలో భారత్‌కు ఘోర పరాజయం.. 244 పరుగులతో న్యూజిలాండ్‌ చారిత్రక విజయం!

13 Nov, 14:55

'ఇట్లు అర్జున' (మూవీ రివ్యూ)

13 Nov, 14:46

క్యాబ్‌ త్వరగా బుక్‌ కావాలంటే ముందే ‘టిప్‌’.. ఓలాపై సీసీపీఏ జరిమానా!

13 Nov, 14:42

ఏపీ రాజధానిలో ఒబెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్.. సీఐఐ సదస్సులో కీలక ఒప్పందం

13 Nov, 14:37

టీటీడీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

13 Nov, 14:28

హైదరాబాద్‌ భారత్‌ సమ్మిట్‌కు 115 మంది విదేశీ వక్తలకు నో ఎంట్రీ.. శశిథరూర్‌ సంచలన ఆరోపణలు

13 Nov, 14:20

బిల్ గేట్స్‌ను అలా ఒప్పించా.. సీఐఐ సదస్సులో ఆసక్తికర విషయాలు చెప్పిన చంద్రబాబు

13 Nov, 14:08

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం: హరీశ్ రావు హెచ్చరిక

13 Nov, 14:07

అమెరికాలో రికార్డు స్థాయిలో బహిష్కరణలు.. ఏడాదిలోనే 4.8 లక్షల మందిని పంపేసిన వైనం

13 Nov, 13:46

అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం: మంత్రి పొన్నం ప్రభాకర్

13 Nov, 13:44

క్యాబ్ రెంటల్స్‌కు కొత్త రూల్స్.. వ్యాపారం ఇక మరింత సులభం!

13 Nov, 13:32

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం.. భారత విమానయాన రంగంలో గందరగోళం

13 Nov, 13:25
..More Telugu News