Advertisement

ఏపీకి ఆరు జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు స్వీకరించనున్న నారాయణ

Andhra
Advertisement
  • ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవం
  • విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, రాజమండ్రితో పాటు కుప్పం ఎంపిక
  • స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో పారిశుద్ధ్యంలో ఏపీ ముందంజ
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు జరిగనున్న కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ పురస్కారాలను అందుకోనున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న 10వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన రాష్ట్రం తరఫున ఈ అవార్డులను స్వీకరించనున్నారు.

పట్టణ పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచినందుకు గాను ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 6 జాతీయ అవార్డులు దక్కాయి. ఇందులో 5 మున్సిపల్ కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీ ఉన్నాయి.

రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, తిరుపతి నగర పాలక సంస్థలు 'సూపర్ స్వచ్ఛ లీగ్' విభాగంలో జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 'సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్' విభాగంలో పురస్కారాన్ని దక్కించుకోగా, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 'ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్' అవార్డును కైవసం చేసుకుంది. అలాగే 20 వేలలోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో కుప్పం మున్సిపాలిటీ 'స్వచ్ఛ సిటీ' అవార్డుకు ఎంపికైంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా భాగస్వామ్యంతో అమలు చేస్తున్న 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం పారిశుద్ధ్య రంగంలో విశేష ఫలితాలను ఇచ్చిందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. నగరాలు, పట్టణాలను చెత్త రహితంగా మార్చేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యలు, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ జాతీయ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా నగరాల మున్సిపల్ కమిషనర్లు కూడా పాల్గొననున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Swachh Survekshan AwardsAndhra PradeshPresident Droupadi MurmuMinister NarayanaSwachha Andhra

More Telugu News

పండుగ రోజున చీకటి గదిలో.. కన్నీళ్లు పెట్టించిన నటి జీవా దీపావళి!

11 Nov, 10:11

అసోంలోని దిగారు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్

11 Nov, 10:08

అఫీషియల్‌: అర్ష్‌దీప్‌, హార్దిక్‌ ట్రేడ్‌ పూర్తి.. పారితోషికం ఎంతంటే..!

11 Nov, 10:06

వేసవి వేడిని నిల్వ చేసి చలికాలంలో వెచ్చదనం.. ఫిన్లాండ్ వినూత్న ప్రయోగం

11 Nov, 10:04

యుద్ధమూ వద్దు.. ఒప్పందమూ వద్దు: ఇరాన్‌పై ట్రంప్ మూడో మార్గం

11 Nov, 10:00

రాష్ట్రపతి బాడీగార్డ్‌ జవాన్‌పై కాల్పులు.. బాణసంచా కాలుస్తుండగా గొడవ

11 Nov, 09:58

ఎంగేజ్‌మెంట్ పార్టీలో గాయం.. రీఎంట్రీ రోజే ఆసీస్ బౌలర్‌కు ఊహించని షాక్!

11 Nov, 09:53

భారత్‌తో టెస్టు సిరీస్‌.. న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. కీలక ఆటగాళ్లకు చోటు!

11 Nov, 09:51

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్ PJ.2.1.. ప్రమాదమెంత?

11 Nov, 09:49

హైదరాబాద్‌కు మరో మణిహారం.. ప్రారంభానికి సిద్ధమైన తమ్మిడికుంట చెరువు

11 Nov, 09:47

అనిరుధ్‌-కావ్య పెళ్లికి గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నారు? కారణాలివే..!

11 Nov, 09:25

ముంబై మ్యూజిక్ కల్చర్‌ను రెహమాన్ మార్చేశారు: సుభాష్ ఘయ్

11 Nov, 09:11

ఎంఎస్‌కే ప్రసాద్ టీమ్‌లో చేరిన క్రిస్ గేల్.. ఇటలీలో సిక్సర్ల మోత ఖాయం!

11 Nov, 09:04

టీ20 వరల్డ్ కప్ తర్వాత కష్టాలు.. 15 ఏళ్ల కుర్రాడిలా మళ్లీ మొదలుపెట్టా: సూర్యకుమార్

11 Nov, 09:02
..More Telugu News