Advertisement

మురసు ఎఫెక్ట్.. రోడ్ల మరమ్మతులకు రూ.870.90 కోట్లు అవసరమన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Andhra
Advertisement
  • 10 జిల్లాల్లో 1,302 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్న జనార్దన్ రెడ్డి
  • అత్యధికంగా బాపట్ల జిల్లాలో 332 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లకు నష్టమని వెల్లడి
  • రాష్ట్రవ్యాప్తంగా కోతకు గురైన 141 ప్రాంతాల్లో ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశామన్న మంత్రి
మురసు తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ పరిధిలోని రహదారులకు భారీగా నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో దాదాపు 1,302 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, వీటి పునరుద్ధరణకు రూ.870.90 కోట్లు అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.

‘‘రహదారుల తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.98.70 కోట్లు, శాశ్వత పనులకు రూ.772.22 కోట్లు అవసరం. మొత్తం పనులకు రూ.870.90 కోట్ల వ్యయం అవుతుంది’’ అని వివరించారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి అందిన ప్రాథమిక నివేదికల ఆధారంగా నష్ట తీవ్రతను లెక్కించినట్లు చెప్పారు.

తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 158 చోట్ల రోడ్లు కోతకు గురికాగా, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి 141 చోట్ల మరమ్మతులు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. మరో 31 ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా, ఇప్పటికే 30 చోట్ల రాకపోకలను పునరుద్ధరించామన్నారు. 207 చోట్ల నేలకొరిగిన చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూశామన్నారు.

జిల్లాల వారీగా చూస్తే బాపట్లలో అత్యధికంగా 332 కిలోమీటర్లు, గుంటూరులో 266 కిలోమీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 202 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. పశ్చిమ గోదావరి (122 కి.మీ), పల్నాడు (93 కి.మీ), ఏలూరు (75 కి.మీ), తూర్పు గోదావరి (68 కి.మీ), నెల్లూరు (66 కి.మీ), కృష్ణా (59 కి.మీ), ప్రకాశం (17 కి.మీ) జిల్లాల్లోనూ రహదారులు దెబ్బతిన్నాయి. వరద నీరు తగ్గుముఖం పట్టిన వెంటనే శాశ్వత పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

BC Janardhan ReddyCyclone MurasuAndhra Pradesh road repairsRoads and Buildings DepartmentAP cyclone damagesAP flood damage funds

More Telugu News

మమత కాళీ పూజ వెలవెల.. తగ్గిన రాజకీయ వైభవం!

10 Nov, 10:14

నిద్రలేచాక ఎన్ని గంటల్లో టిఫిన్‌ చేయాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే!

10 Nov, 10:12

ప్రకాశం జిల్లాలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

10 Nov, 10:10

హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి

10 Nov, 10:08

పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా.. తిరుపతి జిల్లాలో 2 విడతల్లో పంచాయతీ పోరు

10 Nov, 10:06

‘‘రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నా’’.. పొలిటికల్‌ ఎంట్రీపై హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

10 Nov, 09:54

200 ఏళ్ల నాటి నవాబుల నగలు.. దీపావళికి కరీనా రాజసం!

10 Nov, 09:53

ఆధ్యాత్మిక మార్గం నన్ను మార్చింది: పంకజ్ త్రిపాఠి

10 Nov, 09:51

పాక్ యాంకర్ కాల్చివేత.. ప్రమాదం అంటున్న కుటుంబం

10 Nov, 09:47

పూలు, రంగులు కాదు.. 6.5 కిలోల బంగారం, వజ్రాలతో దీపావళి ముగ్గు.. వీడియో ఇదిగో..!

10 Nov, 09:46

టెస్ట్ క్రికెట్‌లో జింబాబ్వే ప్రపంచ రికార్డు.. తొలి జ‌ట్టుగా అరుదైన ఘ‌న‌త‌!

10 Nov, 09:44

వలసలపై ట్రంప్ కీలక ప్రకటన.. డెమోక్రాట్లతో డీల్‌కు ఓకే.. కానీ!

10 Nov, 09:22

అక్కినేని ఇంట దీపావళి వెలుగులు.. నాగచైతన్యతో శోభిత స్పెషల్ ఫొటోలు

10 Nov, 09:19

అమెరికాలో దీపావళికి అధికారిక సెలవు.. ప్రతినిధుల సభలో కీలక ముందడుగు

10 Nov, 09:13
..More Telugu News