ఏడాది పాటు భారత్‌లో.. చివరిరోజు విదేశీయుడి భావోద్వేగ సందేశం
Advertisement
- భారత్‌లో ఏడాది గడిపిన లూకాస్ భావోద్వేగ వీడియో
- ఢిల్లీ విమానాశ్రయంలో చివరి రోజు సందేశం
- తొలినాళ్లలో ట్రాఫిక్, ఎండతో ఇబ్బందులు పడినట్లు వెల్లడి
- భారతీయుల ఆతిథ్యం తనను ఆకట్టుకుందని వెల్లడి
- తన ఆలోచనా విధానం మారిందన్న లూకాస్
భారత్ అంటే కేవలం ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, సంప్రదాయాలు మాత్రమే కాదు.. అంతకుమించి మనుషుల మధ్య ఉండే అనుబంధం! ఇక్కడ ఏడాది పాటు గడిపిన ఓ విదేశీయుడికి కలిగిన అనుభవం ఇదే. భారత్‌ను విడిచి వెళ్లే చివరి రోజు ఢిల్లీ విమానాశ్రయంలో అతడు పంచుకున్న భావోద్వేగ సందేశం ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
లూకాస్ అనే విదేశీయుడు భారత్‌లో తన ఏడాది ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఓ వీడియో రూపొందించాడు. తొలిసారి దేశంలో అడుగుపెట్టినప్పుడు ట్రాఫిక్, ఎండ తీవ్రత తనను ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పాడు. అయితే కొన్ని రోజులకే ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడిపోయానని తెలిపాడు. క్రమంగా భారత్‌ను కొత్త కోణంలో అర్థం చేసుకున్నానని వివరించాడు.
ఒకే చోట ఎన్నో భావోద్వేగాలు
భారత్‌లో జీవితం ఎన్నో భావోద్వేగాల కలయిక అని లూకాస్ అభిప్రాయపడ్డాడు. సంతోషం, కోపం, బాధ.. ఇలా భిన్నమైన అనుభూతులు ఒకే వీధిలో, ఒక్కోసారి ఒకే నిమిషంలో ఎదురవుతాయని చెప్పాడు. ఈ వైవిధ్యమే భారత్‌ను ప్రత్యేకంగా నిలుపుతుందని తన అనుభవాన్ని పంచుకున్నాడు.
మనుషులే అసలైన సంపద
భారతీయులు తనకు ఆహారం పరిచయం చేశారని, తమ ఇళ్లకు ఆహ్వానించారని లూకాస్ గుర్తుచేసుకున్నాడు. ఇక్కడి సంస్కృతి, జీవన విధానాన్ని దగ్గరుండి చూపించారని తెలిపాడు. ఈ అనుభవాలే తన ప్రయాణంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచాయన్నాడు.
మొదట్లో ఏదైనా బాగుందా? లేదా? అని ఆలోచించేవాడినని.. ఆ తర్వాత అది మనసుకు నచ్చిందా? లేదా? అని ఆలోచించడం మొదలుపెట్టానని చెప్పాడు. తన ఆలోచనా విధానంలో వచ్చిన ఈ మార్పు భారత్ నేర్పిన అతిపెద్ద పాఠాల్లో ఒకటని వివరించాడు.
ఓ ప్రాంతం గొప్పతనం అక్కడి ప్రదేశాల్లో కాదు.. అక్కడి మనుషుల్లో ఉంటుందని ఈ ఏడాది తనకు అర్థమైందన్నాడు. తన ఆలోచనలను మార్చిన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలోనే మళ్లీ వస్తానన్న ఆశాభావంతో వీడ్కోలు పలికాడు.