బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

Upasana Konidela says do not suppress another woman for a weak mans happiness
  • మహిళలే మహిళలకు శత్రువులు కావొద్దన్న ఉపాసన
  • ఒకరి విజయం కోసం తోటి మహిళలను కిందికి లాగవద్దని హితవు
  • మహిళలు ఐక్యంగా ఉంటూ కలిసికట్టుగా ఎదగాలని పిలుపు
నటుడు రామ్ చరణ్ భార్య, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల... మహిళలు తమ విజయం కోసం తోటి మహిళలను అణచివేయడంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒకరి ఆనందం కోసం మరొకరి జీవితాన్ని నాశనం చేయకూడదని ఆమె గట్టిగా హెచ్చరించారు.

యాంకర్ సుమ నిర్వహిస్తున్న 'ఫెస్టివల్ ఫర్ జాయ్స్' అనే స్వచ్ఛంద సంస్థ ఐదో వార్షికోత్సవ కార్యక్రమానికి ఉపాసన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "చాలా మంది మహిళలకు మన సహాయం అవసరం. కానీ కొందరు తమ ఎదుగుదల కోసం ఇతర మహిళలను తొక్కేస్తున్నారని నా పరిశోధనలో తేలింది. ఇది నేను గమనించిన పచ్చి నిజం" అని అన్నారు.

"మీ విజయం కోసం లేదా ఒక బలహీనమైన మగాడిని సంతోషపెట్టడం కోసం వేరొక మహిళ జీవితాన్ని అణిచివేయాలని చూడకండి. అది చాలా తప్పు" అని ఉపాసన హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమె సునీత అనే మహిళ కథను ప్రస్తావించారు. తన సుఖం, సంతోషం కోసం మరో మహిళ తీసుకున్న నిర్ణయం వల్ల సునీత, ఆమె పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు.

ఒక మహిళ పడే బాధ ఇంకో మహిళకు ఆనందాన్ని గానీ, విజయాన్ని గానీ ఇవ్వకూడదని ఉపాసన స్పష్టం చేశారు. మహిళలందరూ ఐక్యంగా ఉండి, కలిసికట్టుగా ఎదగాలని పిలుపునిచ్చారు. తాను ఎప్పుడూ మంచి మనసున్న మహిళలనే తన చుట్టూ ఉంచుకోవడానికి ఇష్టపడతానని ఆమె తెలిపారు.
Advertisement
Upasana Konidela
Ram Charan
Anchor Suma
Women Empowerment
Festival for Joys
Social Awareness

More Telugu News