- అర్నబ్ తుపాను కారణంగా ఏపీలో విషాద ఘటనలు
- రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి
- కరెంట్ స్తంభాలు, చెట్లు కూలి పలువురి దుర్మరణం
- విశాఖ, పశ్చిమగోదావరి, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మరణాలు
ఏపీలో అర్నబ్ తుపాను విషాదాన్ని మిగిల్చింది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించారు. పాత గోశాల సమీపంలో విద్యుత్ స్తంభం కూలి ఒకరు మృతి చెందగా, సింహాచలం బాలాజీనగర్‌లో బిందు అనే వివాహిత ప్రాణాలు కోల్పోయారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ ఇద్దరు మృత్యువాత పడ్డారు. చర్చి వద్ద చెట్టు విరిగిపడటంతో చొక్కా కిశోర్ (45), బొండాడవారి వీధిలో కరెంట్ స్తంభం పడటంతో రాంబాబు (34) దుర్మరణం చెందారు.
ఇక, కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర ప్రకాశ్ పురంలో ఓ వృద్ధురాలు మరణించారు. పెను గాలులకు గుడిసె కూలిపోవడంతో కొల్లు వెంకాయమ్మ అనే మరో వృద్ధురాలు మరణించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో విద్యుత్ షాక్‌కు గురై మరో మహిళ మృతి చెందారు. పలు జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.