- సెక్రటేరియట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- అర్నబ్ తుపాను పరిస్థితిపై ఆర్టీజీఎస్లో సమీక్ష
- కూలిన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశం
- రవాణా వ్యవస్థను తక్షణం పునరుద్ధరించాలని సూచన
- మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారం
ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి చేరుకుని, ‘అర్నబ్’ తుపాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. 'రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ' (ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ఆయన నేరుగా పరిశీలించారు.
తుపాను గమనం, ప్రస్తుత పరిస్థితి, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యల గురించి ఆర్టీజీఎస్ అధికారులు ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించారు. తుపాను కారణంగా పలుచోట్ల చెట్లు కూలిపోయిన నేపథ్యంలో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయా అని సీఎం ఆరా తీశారు. జాతీయ రహదారులతో పాటు ఇతర మార్గాల్లో విరిగిపడిన చెట్లను తక్షణమే తొలగించి, రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
తుపాను హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రికి తెలిపారు. అదేవిధంగా ప్రజల నుంచి ‘మనమిత్ర’ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేసి, సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.