- ఏటా 5 వేల మందికి పైగా ప్రవాసుల మాలధారణ
- మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన నియమాలతో పూజలు
- దీక్షాధారులకు అండగా నిలుస్తున్న అమెరికన్ కంపెనీలు
- యూఎస్‌లోనే శబరిమల తరహా ఆలయాల్లో దీక్షా విరమణ
"స్వామియే శరణమయ్యప్ప" అనే శరణు ఘోష ఇప్పుడు కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. అగ్రరాజ్యం అమెరికా వీధుల్లోనూ బలంగా వినిపిస్తోంది. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం యూఎస్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులు తమ సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ అయ్యప్ప దీక్షను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు. ఏటా నవంబర్ 15 నుంచి జనవరి 15 వరకు అమెరికాలో అయ్యప్ప దీక్షల సందడి నెలకొంటోంది. అంచనాల ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు 5 వేల మంది ప్రవాసులు మాల ధరిస్తున్నారు.
దీక్ష స్వీకరించిన వారిలో దాదాపు 90 శాతం మంది టెకీలే ఉండగా.. వైద్యులు, న్యాయవాదులు, విద్యార్థులు, చిన్నారులు సైతం ఉంటున్నారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ వంటి సాధారణ వాతావరణం ఉండే రాష్ట్రాలతో పాటు, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా వంటి రాష్ట్రాల్లో నివసించే వారు సైతం ఈ కఠిన దీక్షను పాటిస్తున్నారు. చన్నీటి స్నానం, భూశయనం, పాదరక్షలు లేకుండా నడవడం వంటి నియమాలను నిష్ఠగా ఆచరిస్తున్నారు. ఇళ్లలోని బేస్మెంట్లలో పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుని, సామూహిక భజనలు నిర్వహిస్తున్నారు.
అమెరికన్ బాస్‌ల ప్రోత్సాహం
అమెరికాలోని కార్పొరేట్ కార్యాలయాల్లో సూటు, బూటు వంటి డ్రెస్ కోడ్ తప్పనిసరి. అయినప్పటికీ, దీక్షలో ఉన్నవారు నల్లటి దుస్తులతో, పాదరక్షలు లేకుండా ఆఫీసులకు హాజరవుతున్నారు. వారి భక్తి, సంప్రదాయాల పట్ల ఉన్న పట్టుదలను చూసి అమెరికన్ బాస్‌లు సైతం ముచ్చటపడుతున్నారు. వారి మత విశ్వాసాలను గౌరవిస్తూ అవసరమైన వెసులుబాట్లు కల్పిస్తున్నారు. వర్జీనియాలోని ఫ్యానీమే, ఫ్రెడ్డిమాక్ వంటి ప్రఖ్యాత సంస్థలు తమ ఉద్యోగులకు దీక్షా కాలంలో ఇంటి నుంచి పనిచేసే (రిమోట్ వర్క్) సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
అమెరికాలోనే 'శబరిమల'
దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు అమెరికాలోనే దీక్షా విరమణ చేస్తున్నారు. ఇందుకోసం మేరీల్యాండ్‌లోని శివవిష్ణు ఆలయం, ఫ్లోరిడాలోని టాంపా అయ్యప్ప ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఈ రెండు ఆలయాల్లోనూ శబరిమల తరహాలోనే పదునెట్టాంబడి (18 మెట్లు) నిర్మించడం విశేషం. అమెరికా నలుమూలల నుంచే కాకుండా, కెనడా నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దీక్ష విరమిస్తున్నారు. కొందరు మాత్రం భారత్‌కు వచ్చి, ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.