- ఒక్క డోసు ధర రూ.600 లోపే
- 2027 ప్రారంభం నుంచి కొత్త ధర అమలు
- మూడేళ్లలో 50 మిలియన్ డాలర్ల ఆదా
- మరో 10 లక్షల మంది పిల్లలకు టీకా అవకాశం
- నాలుగు డోసులతో మలేరియా కేసులు తగ్గే అవకాశం
- ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీకి ప్రాధాన్యం
మలేరియా మహమ్మారి నుంచి చిన్నారులను రక్షించేందుకు భారత్ బయోటెక్ కీలక ముందడుగు వేసింది. అంతర్జాతీయ సంస్థలు ‘గవి’, ‘యునిసెఫ్’తో కలిసి మలేరియా వ్యాక్సిన్ ధరను దాదాపు 40 శాతం తగ్గించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రస్తుతం ఒక్క డోసుకు 9.30 యూరోలుగా ఉన్న ధర 5.50 యూరోలకు తగ్గనుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.600 లోపే ఉంటుంది. ఈ తగ్గింపు 2027 ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో 2027-2029 మధ్య చిన్నారుల టీకా కార్యక్రమాలకు దాదాపు 50 మిలియన్ డాలర్లు ఆదా కానున్నాయి. ఈ నిధులతో మరో 10 లక్షల మంది పిల్లలకు మలేరియా వ్యాక్సిన్ అందించవచ్చని అంచనా.
మలేరియా వ్యాక్సిన్ ‘మాస్కివాక్’
భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను ‘మాస్కివాక్’ పేరుతో తయారు చేస్తోంది. దీని అసలు పేరు ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01. జీఎస్కే, పాత్ సంస్థలు, వాటి భాగస్వాములు అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చిన్నారుల్లో మలేరియా నివారణ కోసం విస్తృత వినియోగానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం దీని తయారీ బాధ్యతలను జీఎస్కే నుంచి భారత్ బయోటెక్‌కు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, మరిన్ని దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం.
నాలుగు డోసులు తీసుకుంటే..
ఈ వ్యాక్సిన్‌ను నాలుగు డోసుల కోర్సుగా ఇస్తారు. మలేరియా వ్యాప్తి కాలానుగుణంగా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సరైన సమయంలో నాలుగు డోసులు తీసుకుంటే మలేరియా కేసులు సుమారు 75 శాతం తగ్గే అవకాశం ఉందని యునిసెఫ్ తెలిపింది. అయితే, ఈ వ్యాక్సిన్ పూర్తిస్థాయి రక్షణ ఇవ్వదు. దోమతెరలు వాడటం, దోమల నియంత్రణ చర్యలు చేపట్టడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం కూడా అవసరం.
ప్రపంచవ్యాప్తంగా 2024లో సుమారు 28.2 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో 6.10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక మరణాలు ఆఫ్రికాలోనే సంభవించాయి. ఆ ప్రాంతంలో ఐదేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం 25 ఆఫ్రికా దేశాల్లో సాధారణ టీకా కార్యక్రమాల్లో మలేరియా వ్యాక్సిన్‌ను చేర్చారు. యునిసెఫ్ ఇప్పటివరకు 7.4 కోట్లకు పైగా డోసులను సేకరించి పంపిణీ చేసింది.