ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు
- తొలి దశ నవంబర్ 26న పోలింగ్
- మూడో దశ డిసెంబర్ 2న ఎన్నికలు
- మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 28న
- మున్సిపల్ ఫలితాలు ఈ నెల 30న
- ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 3న
ఆంధ్రప్రదేశ్లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పుణేఠా బుధవారం విజయవాడలో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది.
తొలి విడతలో భాగంగా 100 పట్టణ స్థానిక సంస్థలకు (ULB) ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 19న పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించి, 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
రెండో విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3న పోలింగ్, 5న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక మూడో విడతలో గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్, లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తారు. రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కుముడులు వీడి, ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది.