ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో యువతకు ఒవైసీ కీలక సూచనలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో యువతకు ఒవైసీ కీలక సూచనలు

Asaduddin Owaisi key suggestions to youth regarding love and marriage
  • అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకున్నాకే 'ఐ లవ్ యూ' చెప్పాలని సలహా
  • పెళ్లి తర్వాతే జీవితంలో స్థిరపడతారని, ముందు కాదని వ్యాఖ్య
  • పెళ్లికాని వాళ్లతోనే సమస్యలంటూ విమర్శలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రేమ, పెళ్లి విషయంలో యువతకు ఆసక్తికరమైన సూచనలు చేశారు. ప్రేమ భావనలు వ్యక్తం చేసే కంటే ముందు పెళ్లికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. యువతకు ఎవరైనా అమ్మాయి నచ్చితే, ముందుగా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని, ఆ తర్వాతే ఆమెకు 'ఐ లవ్ యూ' చెప్పాలని సూచించారు. ఓ సభలో యువతను ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

జీవితంలో పూర్తిగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుంటామని చెప్పే యువత తీరును ఆయన తప్పుబట్టారు. "సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకుంటేనే జీవితంలో సెటిల్ అవుతారు" అని ఆయన స్పష్టం చేశారు. తన నెరిసిన గడ్డాన్ని చూపిస్తూ, "నా గడ్డం తెల్లబడింది, నేను ఇప్పటికీ పూర్తిగా సెటిల్ అవ్వలేదు. పెళ్లి చేసుకుంటే జీవితంలోని మిగతా అంశాలన్నీ అవే సర్దుకుంటాయి" అని సరదాగా వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి.

పెళ్లి చేసుకోని వారు చుట్టుపక్కల వారికి సమస్యలు సృష్టిస్తారని, ఇంట్లో ఎవరూ లేనివారే అందరినీ ఇబ్బంది పెడతారని ఆయన వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకోవడం ద్వారా జీవితంలో స్థిరపడటం చాలా ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు.
Advertisement
Asaduddin Owaisi
AIMIM Chief
Marriage Advice
Youth Relationship Tips
Hyderabad News
Owaisi Speech

More Telugu News