2027లో ఈ రంగాల ఉద్యోగులకు పండగే.. 10.1 శాతం జీతాల పెంపు ఎక్కడంటే!
- 2027లో భారత్లో సగటు జీతాల పెంపు 9.1 శాతంగా అంచనా
- ఎన్బీఎఫ్సీ రంగంలో అత్యధికంగా 10.1 శాతం పెంపు
- ఇంధన రంగంలో 9.9 శాతం పెంపునకు అవకాశం
- రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల్లో 9.8 శాతం పెంపు అంచనా
- కీలక నైపుణ్యాలున్న ఉద్యోగులకే కంపెనీల ప్రాధాన్యం
భారత్లో ఉద్యోగులకు వచ్చే ఏడాది జీతాల పెంపు సగటున 9.1 శాతంగా ఉండొచ్చని తాజా నివేదిక అంచనా వేసింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నా కంపెనీలు ఉద్యోగుల వేతనాల విషయంలో స్థిరమైన బడ్జెట్లతో ముందుకెళ్తున్నాయి. అయితే అన్ని రంగాల్లో ఒకే స్థాయిలో పెంపు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఎన్బీఎఫ్సీ, ఇంధనం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో పనిచేసేవారికి ఎక్కువ పెంపు లభించే అవకాశాలున్నాయి.
టాప్లో ఎన్బీఎఫ్సీ.. 10.1 శాతం పెంపు!
ప్రపంచ వృత్తిపరమైన సేవల సంస్థ ‘అయాన్’ విడుదల చేసిన 2026-27 వార్షిక వేతనాలు, ఉద్యోగుల మార్పుల సర్వే ప్రకారం.. 2027లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) ఉద్యోగులకు సగటున 10.1 శాతం జీతాల పెంపు లభించవచ్చు. ఇంధన రంగంలో 9.9 శాతం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో 9.8 శాతం పెంపు ఉండొచ్చని నివేదిక పేర్కొంది.
2026లోనూ దాదాపు అంతే..
2026లో భారత్లో సగటు వేతన పెంపు 9 శాతంగా నమోదైంది. వచ్చే ఏడాది ఇది 9.1 శాతానికి చేరొచ్చని ‘అయాన్’ అంచనా వేసింది. దేశీయ వినియోగం పెరుగుదల, పెట్టుబడులు, ఎగుమతుల వృద్ధి వ్యాపార సంస్థలకు భరోసా ఇస్తున్నాయని తెలిపింది. ఈ సర్వే కోసం 45 రంగాల్లోని 1,200కు పైగా సంస్థల సమాచారాన్ని విశ్లేషించారు.
ఎక్కువ జీతం కాదు.. సరైన నైపుణ్యానికి ప్రాధాన్యం
కంపెనీలు ఇప్పుడు వేతనాల పెంపులో మరింత కచ్చితమై విధానాన్ని అనుసరిస్తున్నాయని ‘అయాన్ టాలెంట్ సొల్యూషన్స్ ఇండియా’ ప్రతినిధి రూపాంక్ చౌధరి తెలిపారు. మార్కెట్లో కొరతగా ఉన్న నైపుణ్యాలు, కీలక ఉద్యోగాల్లో ప్రతిభావంతులను నిలుపుకోవడంపై దృష్టి పెడుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా తయారీ, సాంకేతిక రంగాల్లో సాధారణ మెరిట్ ఆధారిత పెంపులకు అదనంగా ఇతర సర్దుబాట్లకూ ప్రాధాన్యం పెరుగుతోందన్నారు.
ఉద్యోగుల వలసలు పెరుగుతున్నాయ్..
ఉద్యోగులను నిలుపుకోవడం కంపెనీలకు సవాలుగా మారుతోందని నివేదిక తెలిపింది. ఉద్యోగుల వలసల రేటు 2025లో 16.2 శాతంగా ఉండగా, 2026లో 18 శాతానికి పెరిగింది. మరోవైపు సంస్థల్లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఉత్పాదకత సాధనాల వినియోగం కూడా పెరుగుతోంది. 2025లో 46.1 శాతంగా ఉన్న ఈ వినియోగం 2026లో 56 శాతానికి చేరింది. వేతన నిబంధనల అమలుతో పాటు ఉద్యోగులకు వాటిపై స్పష్టమైన సమాచారం అందించడం కూడా ముఖ్యమని నివేదిక పేర్కొంది.