పండగ వేళ రాజకీయ నిరసనలతో వ్యాపారాలకు దెబ్బ.. రాహుల్కు వర్తక సంఘాల అల్టిమేటం!
- ఆందోళనలపై పునరాలోచించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి
- మార్కెట్ల రక్షణకు ప్రధాని మోదీ జోక్యం కోరిన వర్తక సంఘాలు
- చట్టబద్ధ వ్యాపారాలకు ఆటంకం కలగకుండా చూడాలని సీజేఐకి లేఖలు
- సాధారణ వ్యాపారంలో 10-20 శాతమే జరుగుతోందని సంఘాల వెల్లడి
- చిన్న వ్యాపారులు, కార్మికుల జీవనోపాధిపై ప్రభావం పడుతోందని ఆందోళన
పండగల సీజన్లో రాజకీయ నిరసనల ప్రభావం వ్యాపారాలపై పడుతోందని దేశవ్యాప్తంగా పలు వర్తక, పారిశ్రామిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ’ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మార్కెట్లకు వెళ్లే దారుల్లో ఆంక్షలు, రహదారుల దిగ్బంధం వల్ల వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాయి. నిరసనల విషయంలో పునరాలోచించాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశాయి. వ్యాపార సంస్థలు, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కోరాయి.
పండగ సీజన్పైనే ప్రభావం!
ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం రాష్ట్రాలకు చెందిన సంఘాలు అక్టోబర్ 12, 13 తేదీల్లో ఈ మేరకు లేఖలు రాశాయి. నవరాత్రులు, దసరా, దీపావళి, ఛఠ్ పూజ సమయంలో వ్యాపారాలు ఊపందుకుంటాయని గుర్తుచేశాయి. ఈ తరుణంలో నిరసనల వల్ల వినియోగదారుల రాక తగ్గితే చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, రోజువారీ కూలీల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
రాజకీయాలకు వ్యాపారులు బలికావాలా?
‘భారతీయ ఉద్యోగ్ వ్యాపార్ మండల్’ ఢిల్లీ విభాగం, ఉత్తర్ప్రదేశ్ ఉద్యోగ్ వ్యాపార్ మండల్, ‘ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా’ తదితర సంఘాలు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశాయి. రాజకీయ విభేదాలకు వ్యాపారులు ఆర్థిక మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రాకూడని స్పష్టం చేశాయి. పండగల సమయంలో వీధి నిరసనలను విరమించి, చర్చలు, చట్టపరమైన మార్గాల ద్వారా తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాలని సూచించాయి.
ప్రధాని, సీజేఐకి వర్తక సంఘాల లేఖలు
ప్రధాని మోదీతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ‘జైపుర్ వ్యాపార్ మహాసంఘ్’ లేఖలు రాసింది. మార్కెట్లలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీలోని ‘న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్’, ‘నై సడక్ ట్రేడర్స్ అసోసియేషన్’, ‘మయాపురి పారిశ్రామిక సంఘం’ సహా పలు సంస్థలు కూడా మార్కెట్లకు రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేశాయి.
నిరసన హక్కుతో పాటు వ్యాపార హక్కులూ!
‘ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్స్’ (ఎఫ్ఏఐడీఏ), ‘బెంగళూరు హోల్సేల్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్’ సైతం న్యాయపరమైన రక్షణ కోరాయి. మహిళా వ్యాపారులు, చిన్న పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ సంస్థల ఇబ్బందులనూ పలు సంఘాలు ప్రస్తావించాయి. కేరళంలోని ‘కాలికట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ కూడా మార్కెట్లు, రవాణా మార్గాలకు రక్షణ కల్పించాలని కోరింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కును గౌరవిస్తూనే, చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశాయి.
ఖాన్ మార్కెట్లో 10-20 శాతానికే వ్యాపారం!
ఢిల్లీలోని ‘ఖాన్ మార్కెట్ ట్రేడర్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు సంజీవ్ మెహ్రా తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసుల బారికేడ్ల వల్ల వినియోగదారులు మార్కెట్కు చేరుకోవడం కష్టంగా మారింది. దీంతో సాధారణ స్థాయిలో 10-20 శాతం వ్యాపారమే జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే నిరసనల వల్ల జరిగిన మొత్తం ఆర్థిక నష్టంపై స్వతంత్రంగా ధ్రువీకరించిన గణాంకాలు ఈ లేఖల్లో లేవు.