నల్గొండకు నీళ్లు ఇవ్వొద్దంటూ సీఎంపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
- డిండి ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించవద్దని అధికారులు చెప్పారని గుత్తా ఆగ్రహం
- ప్రాంతాల మధ్య భేదాలు చూపొద్దని ప్రభుత్వానికి సూచన
- నల్గొండ జిల్లాలో 7 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోందని వెల్లడి
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లాకు సాగునీరు అందకుండా అడ్డుకునేందుకు కొందరు అధికారులు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నల్గొండలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈమేరకు ఆవేదన వ్యక్తం చేశారు.
నీళ్లన్నీ పాలమూరుకే కేటాయించాలని, డిండి ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వొద్దని కొందరు వాదించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. "డిండికి నీళ్లు కేటాయించవద్దని అనడం ఏంటి? నల్గొండకు నీళ్లు ఎలా ఇస్తారని సీఎంపై అధికారులు ఒత్తిడి తేవడం ఏంటి?" అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గకూడదని, ప్రాంతాల మధ్య వివక్ష చూపకుండా పాలకులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు.
ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కేవలం 7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని గుత్తా గుర్తుచేశారు. మరోవైపు, పాలమూరు ప్రాంతంలో 25 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు ప్రారంభించినప్పటికీ, వాటికి నీటి వనరులపై స్పష్టత లేదని అన్నారు. ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు.