మమతతో మీ ఫైట్ సూపర్.. లాలూతో చెప్పిన నటి ప్రియాంక చౌదరి
- ‘రైజ్ అండ్ ఫాల్’ షోలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిసిన నటి ప్రియాంక
- మీ వీడియోలన్నీ చూస్తానంటూ లాలూపై అభిమానం చాటుకున్న నటి
- పార్లమెంటులో మమతతో జరిగిన ఓ సరదా సంఘటన ప్రస్తావన
- కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మద్దతుగా షోకు హాజరైన లాలూ
ప్రముఖ నటి ప్రియాంక చాహర్ చౌదరి.. ఆర్జేడీ అధినేత, రాజకీయ ఉద్దండుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. ప్రస్తుతం ఆమె పాల్గొంటున్న 'రైజ్ అండ్ ఫాల్' అనే రియాలిటీ షో వేదికగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లాలూపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ, పార్లమెంటులో జరిగిన ఓ పాత, సరదా సంఘటనను ఆమె గుర్తుచేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షోలో లాలూను చూసిన ప్రియాంక "నేను మీ వీడియోలన్నీ చూస్తుంటాను. అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పేరు వెతికి రీల్స్ అన్నీ చూస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు చాలా ఫన్నీగా ఉంటారు. మీ మాటలు నాకు భలే నవ్వు తెప్పిస్తాయి" అని అన్నారు. తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ షోలో పోటీదారుగా ఉండటంతో, ఆయనకు మద్దతు తెలిపేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ షోకు హాజరయ్యారు.
ఈ క్రమంలో, గతంలో పార్లమెంటులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో రైల్వే ప్రాజెక్టుల విషయంలో లాలూకు జరిగిన సంభాషణను ప్రియాంక గుర్తుచేసుకున్నారు. "రైలు కావాలని వారు అడగలేదంటారు. అడగలేదని మీరంటారు. అడగకపోతే ఎలా వస్తుంది? అంటూ మీరు మాట్లాడిన తీరు చాలా ఫన్నీగా ఉంటుంది" అని ప్రియాంక ఆనాటి ప్రసంగాన్ని గుర్తుచేయడంతో లాలూ నవ్వారు.
'రైజ్ అండ్ ఫాల్' అనేది అధికారం, వ్యూహాల చుట్టూ సాగే గేమ్ షో. ఇందులో 15 మంది కంటెస్టెంట్లు 42 రోజుల పాటు పోటీపడతారు. మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రియాంక, తేజ్ ప్రతాప్‌తో పాటు స్వర భాస్కర్, కరణ్ పటేల్, గౌతమ్ గులాటి వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. బనిజయ్ ఆసియా నిర్మించిన ఈ షో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రసారం అవుతోంది.