స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!
- తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా ఉన్న పసిడి రేట్లు
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,790
- కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 2,39,900కి చేరిన వైనం
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. సోమవారం దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అటు వెండి ధరలోనూ స్వల్ప తగ్గుదల కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మాత్రం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
ఈ రోజు (అక్టోబర్ 12) ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,410 గా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,790 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,560 వద్ద స్థిరంగా ఉన్నాయి. తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి పట్టణాల్లోనూ ఇవే ధరలు అమలవుతున్నాయి.
ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,560 గా నమోదైంది. ఇక వెండి విషయానికొస్తే, హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 100 మేర తగ్గి రూ. 2,39,900 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ వంటి పలు అంశాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో నిరంతరం మార్పులు సంభవిస్తుంటాయి. అందువల్ల, వినియోగదారులు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు స్థానిక విక్రయదారుల వద్ద తాజా ధరలను ధ్రువీకరించుకోవడం మంచింది.