హైదరాబాద్‌లో విషాదం.. హీలియం గ్యాస్‌తో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
- పదేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఐటీ ఉద్యోగి
- కొండాపూర్ అపార్ట్‌మెంట్‌లో టెక్కీ బలవన్మరణం
- ‘అమ్మానాన్న క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనారోగ్య సమస్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో హీలియం గ్యాస్ పీల్చుకొని అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం, హరియాణాకు చెందిన సౌరభ్ శేఖర్ (36) రాయదుర్గంలో తన సోదరుడు లక్షయ్ శేఖర్‌తో కలిసి ఉంటున్నాడు. నగరంలోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
శనివారం మధ్యాహ్నం స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో తాను కొండాపూర్‌లోని వీవీ హైట్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో తన లొకేషన్‌ను పంపాడు.
ఆదివారం ఉదయం అయినా సౌరభ్ ఇంటికి తిరిగి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతని సోదరుడు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఫ్లాట్ తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో, వాటిని పగలగొట్టి చూడగా సౌరభ్ విగతజీవిగా కనిపించాడు. ముఖానికి నల్లటి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని, హీలియం గ్యాస్ సిలిండర్ పైపును ఆ కవర్‌లోకి పెట్టుకొని అతను మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 'అమ్మానాన్న నన్ను క్షమించండి' అని రాసి ఉన్నట్లు సమాచారం. గత పదేళ్లుగా భోజనం చేసిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పితో సౌరభ్ బాధపడుతున్నాడని, ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.