పట్టిసీమ ఫలం.. సీఎం చంద్రబాబుకు కృష్ణా డెల్టా రైతుల కృతజ్ఞతలు
- పట్టిసీమ ద్వారా నీరందించిన సీఎం చంద్రబాబును కలిసిన కృష్ణా డెల్టా రైతులు
- చంద్రబాబును 'ఏపీ వాటర్ మ్యాన్' అంటూ శాలువాతో సత్కరించిన రైతులు
- పట్టిసీమతో 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలించామన్న సీఎం
- పొదుపు చేసిన కృష్ణా జలాలను రాయలసీమకు ఇచ్చామని వెల్లడి
- ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు జల భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సచివాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎంను కలిసిన రైతులు.. ఆయనను శాలువాతో సత్కరించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబును ‘ఏపీ వాటర్ మ్యాన్’గా, ‘జలప్రదాత’గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పట్టిసీమ ద్వారా గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తరలించి, అదే సమయంలో శ్రీశైలంలో పొదుపు చేసిన కృష్ణా జలాలను రాయలసీమకు అందించి అన్ని ప్రాంతాలకు న్యాయం చేశారని కొనియాడారు. కేవలం చంద్రబాబు ముందుచూపుతోనే ఇది సాధ్యమైందని, ఆయన కృషితోనే కృష్ణా డెల్టా సస్యశ్యామలమైందని అన్నారు. పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు సుమారు 500 టీఎంసీల నీటిని తమ ప్రాంతానికి అందించడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు.
రైతుల అభినందనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ, వారికి ధన్యవాదాలు తెలిపారు. పట్టిసీమ ద్వారా వచ్చిన నీటితో కృష్ణా డెల్టాలో సిరులు పండించిన రైతుల కృషిని ఆయన అభినందించారు. "పట్టిసీమ లిఫ్ట్ ద్వారా గత 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి వరద నీటిని కృష్ణా బేసిన్‌కు విజయవంతంగా తరలించాం. ఈ ప్రాజెక్టుతో సాధించిన జలవిజయం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ ఆలోచన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం డెల్టా రైతుల కష్టాలు తీర్చి, సంపద సృష్టించడమే," అని సీఎం వివరించారు.
పట్టిసీమ విజయంతో రెండు ప్రాంతాలకు మేలు జరిగిందని చంద్రబాబు తెలిపారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లో వినియోగించుకోవడం ద్వారా పొదుపు చేసిన కృష్ణా జలాలను రాయలసీమలోని సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించగలిగామని చెప్పారు. దీనివల్లే రాయలసీమలో ‘కియా’ వంటి ప్రతిష్ఠాత్మక పరిశ్రమలకు కూడా నీటిని అందించడం సాధ్యమైందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంపూర్ణ జల భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇరిగేషన్ క్యాలెండర్‌ను పక్కాగా అమలు చేసి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.