గెస్ట్‌హౌస్‌పై కర్ణాటకకు టీటీడీ వార్నింగ్.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక
- తిరుమల గెస్ట్‌హౌస్‌పై కర్ణాటక ప్రభుత్వంతో టీటీడీకి వివాదం
- పవిత్ర స్థలాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపణ
- నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే గెస్ట్‌హౌస్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక
తిరుమలలోని కర్ణాటక ప్రభుత్వ గెస్ట్‌హౌస్ వ్యవహారంపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. వివాదాస్పద నిర్ణయాన్ని కర్ణాటక సర్కార్ వెనక్కి తీసుకోకపోతే, ఆ గెస్ట్‌హౌస్‌ను స్వాధీనం చేసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమల కొండ, సప్తగిరులు మొత్తం శ్రీ వేంకటేశ్వర స్వామికే సొంతమని, ఇతరులకు కేటాయించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని స్పష్టం చేశారు. గతంలో మైసూరు మహారాజుకు టీటీడీ 7.5 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, దానిపై కర్ణాటక ప్రభుత్వం గెస్ట్‌హౌస్ నిర్మించుకుందని గుర్తుచేశారు.
ఇటీవల కర్ణాటక కేబినెట్ ఈ గెస్ట్‌హౌస్‌ను తమ రాష్ట్ర పర్యాటక శాఖకు అప్పగించాలని నిర్ణయించిందని, ఈ నిర్ణయం వెనుక ఓ కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి హస్తం ఉందని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వారికి నోటీసులు పంపుతామని, స్పందించకపోతే గెస్ట్‌హౌస్‌ను టీటీడీ ఆధీనంలోకి తీసుకుంటుందని తేల్చిచెప్పారు.