ఢిల్లీలో 'అప్రకటిత ఎమర్-జెన్‌జీ': కేంద్రంపై శశి థరూర్ ఫైర్
- ఢిల్లీలో ఆంక్షలపై కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఫైర్
- సీజేపీ నిరసనను అడ్డుకునేందుకు యుద్ధ వాతావరణం సృష్టించారని ఆరోపణ
- సమాధానాలు కావాలి.. లాఠీలు కాదని వ్యాఖ్య
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఢిల్లీలో కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసనను అడ్డుకునేందుకు విధించిన కఠినమైన భద్రతా ఆంక్షలను ఆయన తప్పుబట్టారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు 'అప్రకటిత ఎమర్-జెన్‌జీ'ని తలపిస్తున్నాయని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వ్యాఖ్యానించారు.
తాను తెల్లవారుజామున 2 గంటలకు ఢిల్లీకి తిరిగి వచ్చానని, ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని థరూర్ పేర్కొన్నారు. కొన్ని వందల మీటర్లకే చెక్‌పోస్టులు, రోడ్లపై కాంక్రీట్ బారికేడ్లు, స్పైక్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. నగరం అంతటా 22,000 మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించడం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోందన్నారు. సుమారు 250 రైళ్లు రద్దు కావడం, 45 మెట్రో స్టేషన్లు మూసివేయడం, రాజధాని నడిబొడ్డున ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం వంటి చర్యలు తిరోగమనానికి సంకేతమని విమర్శించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)కు వ్యతిరేకంగా సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. అయితే, ఢిల్లీ పోలీసులు ఈ నిరసనకు అనుమతి నిరాకరించారు. ఆందోళనకారులు గుమిగూడకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సహా వందలాది మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల నిర్వహణపై నమ్మకం ఉన్న ప్రభుత్వం ప్రశ్నలను స్వాగతిస్తుందని, కానీ రాజధానిని కోటగా మార్చడం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తుందని థరూర్ అన్నారు. "ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి కానీ లాఠీలతో దాడులు చేయకూడదు. భావప్రకటనను గౌరవించాలి కానీ అణచివేతకు పాల్పడకూడదు" అని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యం పనితీరును ప్రశ్నించేవారి పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు సిగ్గుచేటని ఆయన అభిప్రాయపడ్డారు.