హీరోయిన్ల దుస్తులు, శరీరంపై కామెంట్స్.. తీవ్రంగా స్పందించిన మృణాల్
- ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించిన నటి మృణాల్ ఠాకూర్
- కత్రినా కైఫ్, కృతి సనన్‌లకు మద్దతుగా వ్యాఖ్యలు
- వ్యక్తిగత జీవితాలపై విమర్శించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్య
బాలీవుడ్ నటీనటులపై, ముఖ్యంగా హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు, దుస్తులు, శరీరాకృతిని లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. తోటి నటీమణులు కత్రినా కైఫ్, కృతి సనన్‌లకు ఆమె బాసటగా నిలిచారు. ప్రతి ఒక్కరికీ తమ జీవితాన్ని ఇష్టానుసారం జీవించే హక్కు ఉంటుందని, ఇతరుల వ్యక్తిగత ఎంపికలను విమర్శించే అధికారం ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల తన 'పూజా మేరీ జాన్' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రసవానంతర శారీరక మార్పుల కారణంగా కత్రినా కైఫ్ బాడీ షేమింగ్‌కు గురికావడం, ఒక జువెలరీ యాడ్‌లో ధరించిన దుస్తుల కారణంగా కృతి సనన్ విమర్శలు ఎదుర్కోవడం వంటి సంఘటనల నేపథ్యంలో ఆమె స్పందించారు. కత్రినా, కృతి ఇద్దరూ సినిమా రంగానికి ఎంతో సేవ చేశారని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని గుర్తుచేశారు.
"ప్రతి విషయంలోనూ తప్పులు వెతకడం మానుకోవాలి. సోషల్ మీడియాలో కొందరి ప్రవర్తన చూస్తుంటే పిచ్చి పట్టినట్లుంది" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. వారి కృషిని, విజయాన్ని మరిచిపోయి చిన్న విషయాలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. ఒకప్పుడు మహిళలను మాత్రమే ఎక్కువగా విమర్శించేవారని, కానీ ఇప్పుడు పురుషులు కూడా ఇలాంటివి ఎదుర్కొంటున్నారని మృణాల్ పేర్కొన్నారు. కాగా, విమర్శల నేపథ్యంలో కృతి సనన్ నటించిన జువెలరీ ప్రకటనను సంబంధిత సంస్థ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.