ఢిల్లీలో హై టెన్షన్.. మమతా, కేజ్రీవాల్ సహా పలువురు మాజీ సీఎంల అరెస్ట్
- ఢిల్లీలో నిరసనల ఉద్రిక్తత.. మమతా, కేజ్రీవాల్ అరెస్ట్
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్
- అనుమతి లేదంటూ నేతలను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
- కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌తో పాటు పలువురు ఎంపీల నిర్బంధం
రాజధాని ఢిల్లీలో నేడు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ సహా పలువురు విపక్ష నేతలను కూడా నిర్బంధించి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.
ఎన్నికల కమిషన్, ఎన్నికల ప్రక్రియలకు సంబంధించిన ఆరోపణలపై విపక్షాలు తలపెట్టిన ఆందోళనల్లో పాల్గొనేందుకు మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చారు. సెంట్రల్ ఢిల్లీలోని సౌత్ అవెన్యూ సమీపంలో పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో, సమీపంలోని బస్టాండ్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆమెను, టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఇదే నిరసనలో పాల్గొనేందుకు తన నివాసం నుంచి బయటకు వస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు మార్గమధ్యంలోనే నిర్బంధించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ వంటి ఇతర నేతలను కూడా అరెస్ట్ చేశారు.
జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కేను కూడా పోలీసులు నిర్బంధించారు. నగరంలో నిరసనలకు ఆంక్షలు అమలులో ఉన్నాయని, ఆందోళనకు ముందస్తు అనుమతి లేనందునే నేతలను అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణలతో పాటు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై విపక్షాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టాయి. ఈ అరెస్టుల నేపథ్యంలో భవిష్యత్తులో తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని విపక్ష నేతలు సూచిస్తున్నారు.