ఢిల్లీలో హైడ్రామా.. విమానంలోనే సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్!
- జంతర్ మంతర్ నిరసనకు వస్తుండగా విమానంలోనే సీజేపీ నేతల అరెస్ట్
- కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఇది ప్రభుత్వ నిరంకుశ చర్య అంటూ సీజేపీ తీవ్ర ఆగ్రహం
- యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సహా పలువురిని గృహనిర్బంధం చేసిన అధికారులు
- ఢిల్లీ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు.. 45 మెట్రో స్టేషన్ల మూసివేత
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత, నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలోనే ఆయనను, మరో ఇద్దరు నేతలను నిర్బంధించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు సీజేపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిజీత్ దీప్కే, పార్టీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. వారు ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయిన వెంటనే ఢిల్లీ పోలీసు బృందం ఫ్లైట్‌లోకి ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకుంది. ఈ పరిణామాన్ని అభిజీత్ దీప్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమ్ చేశారు.
"మేం కిందకు దిగే వరకు మీరు ఆగలేరా? బయటకు వచ్చాక అరెస్ట్ చేసుకోండి, మేం భయపడం" అని అభిజీత్ పోలీసులతో వాగ్వాదానికి దిగడం వీడియోలో కనిపించింది. అనంతరం వారిని విమానాశ్రయం నుంచి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఈ ఘటనను సీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రభుత్వ నిరంకుశ చర్య అని, శాంతియుత నిరసనను అణచివేసే కుట్ర అని మండిపడింది. తమ నేతల స్వేచ్ఛను హరించారని ఆరోపిస్తూ వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
మరోవైపు, ఈ నిరసనను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు కనీవినీ ఎరుగని ఆంక్షలు విధించారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ న్యాయవిభాగం అధిపతి రత్నా సింగ్‌లను వారి ఇళ్ల వద్దే గృహనిర్బంధం చేశారు. రాత్రికి రాత్రే సుమారు 400 మంది అనుమానిత నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ వ్యాప్తంగా 45 మెట్రో స్టేషన్లను మూసివేయగా, పలు రైళ్లను రద్దు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 20,000 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. నిరసనకు సరైన సమయంలో అనుమతి కోరలేదన్న కారణంతో శుక్రవారమే పోలీసులు పర్మిషన్ నిరాకరించిన విషయం తెలిసిందే.