కరీనా కపూర్‌ హ్యాండ్‌బ్యాగ్‌ ధర రూ.13 లక్షలు.. అంత స్పెషల్‌ ఏముంది?
Add ap7am to your home Screen

కరీనా కపూర్‌ హ్యాండ్‌బ్యాగ్‌ ధర రూ.13 లక్షలు.. అంత స్పెషల్‌ ఏముంది?

Kareena Kapoor handbag price 13 lakh rupees what is so special about it
  • సింగపూర్‌ ఎఫ్‌1 ఈవెంట్‌కు హాజరైన కరీనా కపూర్‌
  • ఆమె చేతిలో కనిపించిన హెర్మెస్‌ కెల్లీ 25 బ్యాగ్‌
  • బ్యాగ్‌ ప్రారంభ ధర సుమారు రూ.13.25 లక్షలు
  • రీసేల్‌ మార్కెట్‌లో ధర రూ.27-32 లక్షలు
బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఎక్కడ కనిపించినా ఆమె ఫ్యాషన్‌ స్టైల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తాజాగా సింగపూర్‌లో జరిగిన ఫార్ములా వన్‌ (ఎఫ్‌1) గ్రాండ్‌ ప్రిక్స్‌ సందర్భంగా ఆమె ధరించిన దుస్తుల కంటే ఓ హ్యాండ్‌బ్యాగ్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌ ‘హెర్మెస్‌’కు చెందిన ఈ బ్యాగ్‌ ధర అక్షరాలా రూ.13 లక్షలకు పైనే! మరి ఈ బ్యాగ్‌లో అంత ప్రత్యేకత ఏముంది? రీసేల్‌ మార్కెట్‌లో ఎంత పలుకుతోంది? అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం.. 

కరీనా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో సింగపూర్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. కారులో కూర్చుని, వెనుక సింగపూర్‌ అందమైన స్కైలైన్‌ కనిపించేలా ఫొటోకు పోజిచ్చారు. తెల్లటి దుస్తులు, బ్రౌన్‌ జాకెట్‌, సిల్క్‌ స్కార్ఫ్‌తో స్టైలిష్‌గా కనిపించారు. అయితే, ఆమె చేతిలోని హ్యాండ్‌బ్యాగ్‌ మాత్రం ఫ్యాషన్‌ ప్రియుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది.

హెర్మెస్‌ కెల్లీ 25 ప్రత్యేకతలివే!
కరీనా చేతిలో ఉన్నది హెర్మెస్‌ కెల్లీ 25 మోడల్‌ బ్యాగ్‌గా గుర్తించారు. ఇది టోగో లేదా ఎప్సమ్‌ లెదర్‌తో తయారవుతుంది. గోల్డ్‌ ఫినిషింగ్‌ హార్డ్‌వేర్‌ దీని ప్రత్యేకత. బ్యాగ్‌కు ఆండ్రాయిడ్‌ ఆకారపు చార్మ్‌ను కూడా జతచేశారు. చిన్న సైజులో ఉన్నప్పటికీ లగ్జరీ ఫ్యాషన్‌ ప్రపంచంలో ఈ మోడల్‌కు మంచి గుర్తింపు ఉంది.

కొనాలంటే రూ.13 లక్షలకు పైనే!
సోథెబీస్‌ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం.. 2026లో అమెరికాలో హెర్మెస్‌ కెల్లీ బ్యాగ్‌ల ధరలు 3.8 శాతం నుంచి 8.9 శాతం వరకు పెరిగాయి. ఈ మోడల్‌ ప్రారంభ ధర 13,700 డాలర్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.13.25 లక్షలు. అంటే ఓ ఖరీదైన కారు ధరకు దగ్గరగా ఈ బ్యాగ్‌ విలువ ఉంటుందన్నమాట.

రీసేల్‌ మార్కెట్‌లో ఇంకా ఎక్కువ ధర!
ఈ బ్యాగ్‌కు డిమాండ్‌ ఎలా ఉంటుందంటే.. రీసేల్‌ మార్కెట్‌లో దీని ధర 28,000 నుంచి 33,000 డాలర్ల వరకు పలుకుతోంది. అంటే సుమారు రూ.27 లక్షల నుంచి రూ.32 లక్షలు. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ ధర కూడా ఉండొచ్చు. మాడిసన్‌ అవెన్యూ కౌచర్‌ వెబ్‌సైట్‌లో హెర్మెస్‌ కెల్లీ సెల్లియర్‌ 25 బ్యాగ్‌ ఒకటి 36,500 డాలర్లకు లిస్ట్‌ అయింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.35.32 లక్షలు.

ఇక కరీనా తన లుక్‌ను తెల్లటి ప్యాంటు, బాడీసూట్‌, బ్రౌన్‌ జాకెట్‌తో పూర్తి చేశారు. గివెన్చీ బ్రాండ్‌కు చెందిన నల్లటి ఓవర్‌సైజ్డ్‌ సన్‌గ్లాసెస్‌ ధర సుమారు రూ.54,600. మొత్తంగా ఆమె లుక్‌లో ఖరీదైన బ్యాగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Advertisement
Kareena Kapoor
Hermes Kelly 25
Singapore F1 Grand Prix
Luxury Handbags
Bollywood Fashion
Hermes Bag Price

More Telugu News