ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనలు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు!
- ఢిల్లీకి నిరసనకారులు రాకుండా అడ్డుకోవాలని కేంద్రం ఆదేశాలు
- ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచన
- జంతర్‌మంతర్ నిరసనకు అనుమతి నిరాకరించినట్లు తెలిపిన హోం శాఖ
- ఎస్‌ఐఆర్‌లో అక్రమాలపై సీజేపీ ఆందోళనకు పిలుపు
- గత నిరసనల్లో ఆస్తులకు నష్టం జరిగిందని కేంద్రం ఆరోపణ
ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. దేశ రాజధానికి నిరసనకారులు చేరుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించింది. అనుమతి లేకుండా ఢిల్లీలోకి ప్రవేశించే ప్రయత్నాలను అడ్డుకోవాలని స్పష్టం చేసింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ శనివారం జంతర్‌మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (ఎస్‌ఐఆర్)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది.
అయితే, ఈ నిరసనకు అనుమతి నిరాకరించినట్లు కేంద్ర హోం శాఖ తన లేఖలో పేర్కొంది. అయినప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి సీజేపీ మద్దతుదారులు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలిపింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులకు కేంద్ర హోం శాఖ ఈ మేరకు లేఖ రాసింది. రాష్ట్రాల నిఘా విభాగాలు, సరిహద్దు అధికారులు, రవాణా విభాగాలు, ఢిల్లీ పోలీసుల మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరగాలని సూచించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చట్ట పరిధిలో తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
నిరసన పేరుతో గతంలో జరిగిన కార్యక్రమాల్లో సీజేపీ మద్దతుదారులు అధికారుల ఆదేశాలను ఉల్లంఘించినట్లు హోం శాఖ ఆరోపించింది. వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన ఆందోళనకారుల కారణంగా గతంలో ప్రజా జీవనానికి అంతరాయం కలిగిందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొంది. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రస్తావన
2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా కేంద్ర హోం శాఖ ప్రస్తావించింది. నిరసనల కోసం నిర్దేశించిన ప్రాంతాల్లో సభలు, సమావేశాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణ, చట్టాల అమలు అధికారుల బాధ్యతని స్పష్టం చేసింది.
మరోవైపు, నిరసన నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. భద్రతా ఏర్పాట్ల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. దీంతో శనివారం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. కొందరు చివరి నిమిషంలో తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది.