బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనుకి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
- అరకు పార్లమెంట్ టీడీపీ పరిశీలకుడిగా చిన్న శ్రీను నియామకం
- వైసీపీ నుంచి చేరిన నెలరోజులకే కీలక బాధ్యతలు అప్పగింత
- పార్టీ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానన్న శ్రీను
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరిశీలకుడిగా ఆయన్ను నియమిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన చిన్న శ్రీనుకు నెల రోజుల్లోనే ఇంతటి ముఖ్యమైన బాధ్యతను అప్పగించడం ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న అరకు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం జరిపినట్లు తెలుస్తోంది.
ఈ నియామకంపై చిన్న శ్రీను స్పందిస్తూ... చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే తాను టీడీపీలో చేరానని తెలిపారు. అరకు ప్రాంతంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ, పార్టీ శ్రేణులతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని ఆయన వివరించారు.