బిగ్‌బాస్ ఫేమ్ అర్చనా గౌతమ్ కేఫ్‌లో దొంగతనం
- సీసీటీవీ ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నటి
- ముంబైలో ఇలా జరగడంపై ఆవేదన వ్యక్తం చేసిన అర్చన
- పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
"బిగ్ బాస్ 16" రియాలిటీ షోతో పాప్యులర్ అయిన నటి, మోడల్ అర్చనా గౌతమ్ ముంబైలో నడుపుతున్న కేఫ్‌లో దొంగతనం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కేఫ్‌లోకి చొరబడిన దొంగ క్యాష్ కౌంటర్‌ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను అర్చన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"ముంబైలోని నా కేఫ్‌లో జరిగిన ఈ దొంగతనం సీసీటీవీ ఫుటేజ్‌ను మీతో పంచుకుంటున్నాను. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి, మీ ఇళ్లు, వ్యాపారాల భద్రతపై దృష్టి పెట్టండి" అని ఆమె తన పోస్టులో కోరారు. "చాలా ఇష్టంతో, కష్టపడి నా పొదుపు మొత్తంతో ఈ కేఫ్‌ను నిర్మించుకున్నాను. ప్రతి చిన్న వస్తువును నేనే దగ్గరుండి సమకూర్చుకున్నాను. కానీ ఒక దొంగ నా కేఫ్‌లోకి చొరబడి మొత్తం క్యాష్ కౌంటర్‌నే ఎత్తుకెళ్లాడు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై తాను ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అర్చన తెలిపారు. "ముంబై నాకు ఎప్పుడూ సురక్షితమైన నగరంగానే అనిపించింది. అందుకే ఈ ఘటన నన్ను మరింత బాధకు గురిచేసింది. దయచేసి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి, మీ చుట్టూ ఉన్న భద్రతపై శ్రద్ధ వహించండి" అని ఆమె విజ్ఞప్తి చేసింది. ముంబైలో తనకే ఇలా జరగడం నమ్మలేకపోతున్నానని పేర్కొంది.
అర్చనా గౌతమ్ 2025 అక్టోబర్‌లో ఈ కేఫ్‌ను ప్రారంభించి ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. గతంలో ఆమె "సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ ఇండియా" షోలో పాల్గొని వంటపై తనకున్న ఆసక్తిని ప్రదర్శించింది. ‘బిగ్ బాస్ 16’తో భారీగా పాప్యులారిటీ సంపాదించిన అర్చన, ఆ తర్వాత "ఖత్రోన్ కే ఖిలాడీ 13" వంటి రియాలిటీ షోలలో కూడా కనిపించింది.