ఫ్లైదుబాయ్ కో-పైలట్ అసలు టార్గెట్ ఏంటో తెలిసిపోయింది!
- టెల్ అవీవ్‌లో విమానం కూల్చాలని భావించిన ఫ్లైదుబాయ్ కో-పైలట్
- ఎత్తైన భవనంపై విమానాన్ని కూల్చాలని భావించినట్లు ‘కొరియెరే డెల్లా సెరా’లో కథనం
- ఘటన సమయంలో విమానంలో వెలిగిన ఎమర్జెన్సీ లైట్లు
- దుండగుడు ఇంజిన్‌ను ఆఫ్ చేశాడా అనే కోణంలో దర్యాప్తు
ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన దాడి ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన ఒమన్ కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ విమానాన్ని టెల్ అవీవ్‌కు తీసుకెళ్లి అక్కడి ఓ ఎత్తైన భవనాన్ని ఢీకొట్టాలని భావించినట్లు ఇటలీకి చెందిన ‘కొరియెరే డెల్లా సెరా’ పత్రిక నివేదించింది. ఈ ఘటనపై సిబ్బంది వాంగ్మూలాలు, విమానయాన అధికారులకు ఇచ్చిన నివేదికలు, ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల వివరాల ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించినట్లు తెలిపింది.
కాక్‌పిట్‌లోకి వెళ్లే ముందు హమ్మామీ ప్రార్థనలు చేస్తున్నట్లు నటించినట్టు సమాచారం. ఆ తర్వాత క్రాష్ యాక్స్ తీసుకుని కెప్టెన్ మచ్చర్‌పై వెనుక నుంచి దాడి చేసినట్లు నివేదిక పేర్కొంది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, డ్యూటీలో లేని ఇద్దరు పైలట్లు లోపలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
అంతకుముందు హమ్మామీ ఆటోపైలట్‌ను ఆపి విమానం కంట్రోల్ స్టిక్‌ను కిందకు నెట్టినట్లు సమాచారం. దీంతో విమానం కేవలం 30 సెకన్లలో దాదాపు 16 వేల అడుగులు కిందకు దూసుకెళ్లింది. వేగం గంటకు 970 కిలోమీటర్లకు పైగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఈ సమయంలో విమానం తోక భాగంలోని రడ్డర్ దెబ్బతిన్నట్లు పేర్కొంది.
విమానం ఇంజిన్లకు సంబంధించిన ఫ్యూయల్ స్విచ్‌లను ‘రన్’ నుంచి ‘కటాఫ్’కు మార్చారా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఘటన సమయంలో విమానంలోని ఎమర్జెన్సీ లైట్లు వెలిగాయి. రెండు ఇంజిన్లు ఆగిపోయినా, జనరేటర్లు పనిచేయకపోయినా ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని నివేదిక వివరించింది.
చివరకు ప్రయాణికులు హమ్మామీని అదుపులోకి తీసుకున్నారు. డ్యూటీలో లేని పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ను ఆసుపత్రికి తరలించారు. కో-పైలట్‌ను సౌదీ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ ‘ఉగ్రదాడి’గా పేర్కొంది. టెల్ అవీవ్‌కు వెళ్లే విమానంలో ఒమన్ పైలట్‌కు అనుమతి ఎలా లభించిందన్న అంశంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.