ప్రపంచం పాక్ వైపు ఉన్నప్పుడు.. రష్యా మాత్రం భారత్‌కు అండగా నిలిచింది: జైశంకర్
- భారత్‌కు రష్యా అండగా నిలిచిందన్న జైశంకర్
- 1950ల నుంచే ఇరు దేశాల మధ్య బంధమని వెల్లడి
- పశ్చిమ దేశాల విమర్శలపై భారత్ వైఖరి స్పష్టీకరణ
- రష్యాతో వాణిజ్యం, ఇంధన సహకారం కొనసాగింపు
- ఉక్రెయిన్ యుద్ధానికి చర్చలే పరిష్కారమన్న భారత్
భారత్-రష్యా సంబంధాలు నేటివి కావని, దాని వెనుక దశాబ్దాల చరిత్ర ఉందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ భద్రత, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వచ్చిన సందర్భాల్లో రష్యా అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఒక దేశంతో సంబంధాలను మరో దేశం అనుభవంతో పోల్చి చూడలేమని స్పష్టం చేశారు.
ఢిల్లీలో ఆదివారం జరిగిన మ్యూనిక్ భద్రతా సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. 1950ల నుంచి భారత్, రష్యా మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అప్పట్లో ప్రపంచంలోని చాలా దేశాలు పాకిస్థాన్‌లోని సైనిక పాలనకు మద్దతుగా ఉన్నా.. రష్యా మాత్రం భారత్‌కు అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఆ చరిత్రను తాము మర్చిపోలేమన్నారు.
పశ్చిమ దేశాలు రష్యాతో భారత్ సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. యూరప్‌కు రష్యాతో ఉన్న అనుభవం వేరు, భారత్‌కు ఉన్న అనుభవం వేరని చెప్పారు. భారత్ దృష్టిలో రష్యాతో సంబంధాలు ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నాయని తెలిపారు.
కాలక్రమంలో ఈ బంధం రక్షణ రంగానికే పరిమితం కాలేదని జైశంకర్ అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, అణు, అంతరిక్ష రంగాల్లోనూ సహకారం విస్తరించిందని చెప్పారు. రష్యాతో ఇంధన సహకారాన్ని కొనసాగించడంపై పశ్చిమ దేశాల నుంచి విమర్శలు వస్తున్న వేళ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఉక్రెయిన్ యుద్ధంపైనా భారత్ వైఖరిని జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు, దౌత్యం, సంప్రదింపులే మార్గమని అన్నారు. ఇటీవలి నెలల్లో భారత్ రష్యా, ఉక్రెయిన్‌తో నేరుగా చర్చలు జరిపిందని తెలిపారు. నల్ల సముద్రంలో నౌకల రాకపోకలు, ధాన్యం, ఇంధన ఎగుమతులు, కీలక మౌలిక సదుపాయాలపై దాడుల వంటి అంశాలపై ఇరు దేశాలతో మాట్లాడినట్లు వెల్లడించారు.