విస్తరించిన ఉపరితల ద్రోణి.. ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు!
- తమిళనాడు నుంచి అరేబియా సముద్రం వరకు విస్తరించిన ద్రోణి
- ఏపీలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు
- గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
- రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
తమిళనాడు, కేరళ మీదుగా అరేబియా సముద్రం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, మన్నార్ గల్ఫ్ నుంచి ఉత్తర కేరళ మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు, దక్షిణ కర్ణాటక పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం కూడా ఈ ద్రోణిలో విలీనమైంది. ఈ వ్యవస్థల ప్రభావంతో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయి.
ఈ వాతావరణ మార్పుల వల్ల సోమవారం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా. రాయలసీమలోనూ పలుచోట్ల జల్లులు పడే సూచనలు ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆదివారం తేలికపాటి వర్షాలు కురవవచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో అనకాపల్లిలో 4 సెం.మీ., మందసలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి.*