భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులకు నయారా షాక్
- పెట్రోల్‌పై రూ.5 పెంచిన నయారా ఎనర్జీ
- డీజిల్‌పై లీటరుకు రూ.3 పెంపు
- శనివారం నుంచి అమల్లోకి కొత్త ధరలు
- 7,000కు పైగా బంకుల్లో ధరల పెంపు
- ప్రభుత్వ రంగ బంకుల్లో మాత్రం మారని ధరలు
వాహనదారులకు నయారా ఎనర్జీ షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి ఉన్న 7,000కు పైగా పెట్రోల్ బంకుల్లో కొత్త ధరలు అమలవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు, ఇంధన ధరలు పెరగడంతో కొనుగోలు వ్యయం పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది నయారా ఎనర్జీ ఇంధన ధరలను పెంచడం ఇది రెండోసారి. మార్చిలోనూ పెట్రోల్, డీజిల్‌పై ఇదే స్థాయిలో ధరలు పెంచింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో అప్పట్లో ధరలు పెంచింది. ముడిచమురు ధరలు తగ్గడంతో జులైలో ఆ పెంపును వెనక్కి తీసుకుంది.
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను మార్చలేదు. దేశంలో 1.04 లక్షలకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో 90 శాతానికి పైగా ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలోనే ఉన్నాయి.
ఇటీవల ప్రైవేటు ఇంధన విక్రయ సంస్థలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలను తగ్గించకూడదని కేంద్రం సూచించింది. ఇదిలా ఉంటే వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అక్టోబర్‌లో రూ.62.50 మేర పెంచాయి. 19 కిలోల సిలిండర్ ధర పెరిగింది. అయితే గృహ వినియోగ ఎల్పీజీ ధరను రూ.942 వద్దే కొనసాగిస్తున్నాయి.
విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర కూడా పెరిగింది. లీటరుకు రూ.16 చొప్పున పెంచడంతో దేశీయ విమాన సంస్థలకు లీటర్ ఏటీఎఫ్ ధర రూ.121 నుంచి రూ.137కు చేరింది.