స్మిత్ మచ్చర్‌పై కాక్‌పిట్‌లోని క్రాష్ యాక్స్‌తో కోపైలట్ దాడి: యూఏఈ నిర్ధారణ
Advertisement

స్మిత్ మచ్చర్‌పై కాక్‌పిట్‌లోని క్రాష్ యాక్స్‌తో కోపైలట్ దాడి: యూఏఈ నిర్ధారణ

Smith Macher attacked by co-pilot with crash axe in cockpit UAE confirms
  • భారత పైలట్‌పై సహచరుడి దాడి.. యూఏఈ ప్రాసిక్యూటర్ల నిర్ధారణ
  • అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు విమానాల్లో క్రాష్ యాక్స్ తప్పనిసరి
దుబాయ్ నుంచి టెల్ అవివ్ వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన విషయం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రాసిక్యూటర్లు శనివారం అధికారికంగా నిర్ధారించారు.

విమానం కాక్‌పిట్‌లో ఉన్న 'క్రాష్ యాక్స్' (గొడ్డలి)తో కో-పైలట్ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన విమానయాన రంగంలో తీవ్ర కలకలం రేపింది.

అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం, ప్రతి వాణిజ్య విమానంలోనూ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఒక క్రాష్ యాక్స్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు విమానం నుంచి బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుంది. 25 ఏళ్ల క్రితం అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడుల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ గొడ్డళ్లను ప్రయాణికుల క్యాబిన్ల నుంచి కాక్‌పిట్‌కు మార్చారు. ఇప్పుడు అదే గొడ్డలి పైలట్‌పై దాడికి ఆయుధంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
Advertisement
Smith Macher
Hamam Al Hamami
flydubai
Crash axe attack
UAE aviation safety
Cockpit assault

More Telugu News