టాటాలో ముసలం... ఆ మీటింగ్ వీడియోలు, మినిట్స్ ఇవ్వాలని నోయేల్ టాటా డిమాండ్
- చంద్రశేఖరన్ పునర్‌నియామకంపై భగ్గుమన్న విభేదాలు
- బోర్డు మీటింగ్ మినిట్స్, వీడియో ఇవ్వాలని నోయెల్ టాటా డిమాండ్
- నియామక తీర్మానం చట్టవిరుద్ధమని, దానికి విలువ లేదని పేర్కొన్న టాటా ట్రస్ట్స్
- కంపెనీ నిబంధనలు, కాస్టింగ్ ఓటుపై ఇరువర్గాల మధ్య న్యాయపోరాటం
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్‌నియామకంపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో అనుసరించిన విధానాలను ప్రశ్నిస్తూ ఆయన టాటా సన్స్ బోర్డుకు లేఖ రాశారు. ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్, వీడియో రికార్డింగ్ అందించాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 30న రాసిన ఈ-మెయిల్‌లో, చంద్రశేఖరన్ పునర్‌నియామక అంశం అసలు సమావేశపు ఎజెండాలోనే లేదని నోయెల్ టాటా స్పష్టం చేశారు. 'డీబ్రీఫ్ బై ఎన్ఆర్‌సీ' అనే అంశం కింద దీనిని చర్చకు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ తీర్మానం చట్టవిరుద్ధమని, దానికి చట్టపరమైన విలువ లేదని గ్రూప్‌లో మెజారిటీ వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్ ఇప్పటికే ప్రకటన చేసింది.
సెప్టెంబర్ 17న జరిగిన సమావేశంలో, టాటా ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్ అయిన నోయెల్ టాటా ఈ నియామకాన్ని వ్యతిరేకించారు. మరో నామినీ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ మాత్రం మద్దతు తెలిపారు. దీంతో ఓట్లు సమానం కావడంతో, సమావేశానికి అధ్యక్షత వహించిన స్వతంత్ర డైరెక్టర్ హరీశ్ మన్వానీ తన కాస్టింగ్ ఓటును ఉపయోగించి తీర్మానాన్ని ఆమోదింపజేశారు.
ఈ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు టాటా సన్స్, మాజీ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణల నుంచి న్యాయసలహాలు తీసుకుంది. కంపెనీ ఆర్టికల్ 121 ప్రకారం కాస్టింగ్ ఓటు చెల్లుబాటు అవుతుందని వారు తెలిపారు. అయితే, ఇద్దరు నామినీ డైరెక్టర్లు అంగీకరించాల్సిందేనని వాదిస్తున్న టాటా ట్రస్ట్స్, తమ వాదనకు మాజీ సీజేఐ జిస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయాన్ని ఉటంకిస్తోంది. దీంతో టాటా గ్రూప్‌లో ఈ వివాదం మరింత ముదిరినట్లయింది.