పైలట్‌పై దాడి ఎఫెక్ట్.. టెల్ అవీవ్‌కు విమానాలు నిలిపివేసిన ఫ్లైదుబాయ్
- దుబాయ్ విమానంలో కెప్టెన్‌పై దాడి ఘటన
- అధికారుల ఆదేశాలతో టెల్ అవీవ్‌కు విమాన సర్వీసుల రద్దు
- భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను హీరోగా కొనియాడిన నెతన్యాహు
తమ విమానంలో కెప్టెన్‌పై కో- పైలట్ దాడి చేసిన ఘటన నేపథ్యంలో, ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దుబాయ్‌కు చెందిన విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని, అధికారుల అభ్యర్థన మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఫ్లైదుబాయ్ సీఈఓ గైత్ అల్ గైత్ తెలిపారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు 172 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ 1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో ఉన్న సహ పైలట్, భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. దీంతో విమానం నిమిషం వ్యవధిలోనే దాదాపు 17,000 అడుగుల కిందకు పడిపోయింది. తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యంగా కాక్‌పిట్ డోర్‌ను తెరవడంతో ప్రయాణికులు, ఇతర సిబ్బంది లోపలికి ప్రవేశించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఈ ఘటనలో హీరోగా నిలిచిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో మాట్లాడి ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. 'ది గార్డియన్' కథనం ప్రకారం, "నా ప్రాణాల కోసం పోరాడాను. నేను లేవకపోతే ప్రయాణికుల ప్రాణాలు పోతాయని గ్రహించి, చివరి శక్తి కూడగట్టుకుని కాక్‌పిట్ డోర్ తెరిచాను" అని కెప్టెన్ మచ్చర్ ప్రధాని మోదీకి వివరించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా కెప్టెన్‌ను హీరోగా కొనియాడారు.
దాడికి పాల్పడిన ఒమన్ జాతీయుడైన సహ పైలట్‌ను సౌదీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందా అనే దానిపై యూఏఈ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఫ్లైదుబాయ్‌తో పాటు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కూడా టెల్ అవీవ్‌కు తమ కోడ్‌షేర్ విమానాలను రద్దు చేశాయి. దీంతో యూఏఈలో చిక్కుకున్న ఇజ్రాయెల్ పౌరులను స్వదేశానికి తరలించడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నారు.